వైసీపీ ఆధినేత, ఏపీ సీఎం జగన్ ఆషామాషీ వ్యక్తి అయితే ఏమీ కాదు. రాజకీయాల్లో అనుభవం తక్కువ ఉన్నా, ఎవరికీ తీసిపోని విధంగా ఆయన రాజకీయాలు ఉంటాయి. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు కూడా కలవరపడే విధంగా జగన్ రాజకీయాలు ఉంటున్నాయి. తాత్కాలికంగా కొన్ని ఎదురుదెబ్బలు కూడా తగులుతున్నాయి. జగన్ ముందుచూపుతో చేస్తున్న రాజకీయాల ప్రభావం ఆ తరువాత ఫలితాల రూపంలో కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీలో అసమ్మతి పెరిగినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా సీనియర్ రాజకీయ నాయకులు జగన్ పై గుర్రుగా ఉంటూ, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ  బహిరంగంగా తమ బాధను వెళ్లగక్కుతున్నారు. వీరంతా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నవారే. 

 

IHG's innovative campaigns are turning Andhra voters in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YS JAGAN MOHAN REDDY' target='_blank' title='jagan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jagan</a> ...


ప్రస్తుతం జగన్ సీనియర్ రాజకీయ నాయకులు ఎవరిపైనా  ఆధారపడలేదు. సొంతంగా ఆయనకంటూ ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక జగన్ టీమ్ లో ఉన్న వారు కూడా ఎక్కువగా యువ నాయకులే దర్శనమిస్తారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వారిని చూసుకున్నా, ఎక్కువగా జగన్ వయసు కు దగ్గరగా ఉన్న వారే కనిపిస్తారు. సీనియర్లు ముగ్గురు, నలుగురు ఉన్నా.. వారంతా గత రాజశేఖర్ రెడ్డి హయాంలో, ఆయనకు అత్యంత సన్నిహితులైన వారికి మాత్రమే జగన్ తన క్యాబినెట్లో అవకాశం ఇచ్చారు. వారిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారే కనిపిస్తారు. 

 

ఇక రాజ్యసభ ఎన్నికల తర్వాత మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవులకు రాజీనామా చేస్తారు కాబట్టి, ముగ్గురు మాత్రమే సీనియర్ రాజకీయ నాయకులు కనిపిస్తారు. ప్రస్తుతం సీనియర్ రాజకీయ నాయకులు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వచ్చారు. ఆ తరువాత ఏపీలో జగన్ గాలి బలంగా వీయడంతో ఆనం కూడా ఎమ్మెల్యేగా గెలిచారు . ఇదేవిధంగా చాలామంది సీనియర్లు జగన్ గాలిలో గెలిచిన వారే. వారే ఇప్పుడు  జగన్ పై అసంతృప్తితో ఉంటూ బహిరంగంగా ఆ విషయాన్ని వెళ్లగక్కుతుండడం జగన్ కు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. 


2024 ఎన్నికల్లో సీనియర్లు ఎవరికి టిక్కెట్లు ఇచ్చేలా జగన్ కనిపించడం లేదు. పూర్తిగా తన మాట వినే వారు, తనకు అత్యంత సన్నిహితులైన వారు మాత్రమే పక్కన పెట్టుకుని, మిగిలిన వారిని పక్కన పెట్టాలి అన్నదే జగన్ ఉద్దేశంగా కనిపిస్తోంది అట. అందుకే పార్టీలో ఎక్కువగా యువతకే ప్రాధాన్యం ఇస్తూ, జగన్ ముందుకు వెళ్తున్నారు. పార్టీ లో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు చాలామంది ఇప్పటికే అనేక పార్టీలు నుండి వచ్చిన వారు కావడంతో వారిపై జగన్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టుగా లేరు. ప్రస్తుతానికి సీనియర్ల హడావుడి వైసీపీ ప్రభుత్వంలో కనిపించినా, వచ్చే ఎన్నికలనాటికి వారి ప్రభావం కనిపించకుండా  చేయాలన్నదే జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: