తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజికవర్గ పార్టీగా ముద్రవేసుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి అందులో కమ్మ నేతల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే 2014 ఎన్నికల తర్వాత వారి ప్రభావం మరీ ఎక్కువ అయిన విషయం తెలిసిందే. కాకపోతే రాష్ట్ర స్థాయిలో వారి ప్రభావం ఎక్కువగా ఉన్నా...తూర్పు గోదావరి జిల్లాకు వచ్చేసరికి అది కాస్త తగ్గిపోయింది. ఒకప్పుడు జిల్లాలో టీడీపీలో నాలుగు అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు కమ్మ నేతలకే కేటాయించే వారు.

 

పెద్దాపురం సీటు బొడ్డు భాస్కర రామరావు, రాజమండ్రి అసెంబ్లీ సీటు గోరంట్ల బుచ్చయ్య చౌదరీ, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, రాజానగరం పెందుర్తి వెంకటేష్‌లకు టిక్కెట్లు దక్కేవి. అటు రాజమండ్రి పార్లమెంట్ సీటు మురళి మోహన్‌కు దక్కేది. అయితే 2014 నుంచి బొడ్డు భాస్కర రామారావు అటు ఇటు పార్టీలు మారడంతో పెద్దాపురం కాపు నేత చినరాజప్ప చేతిలోకి వెళ్లింది. ఇక 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ బుచ్చయ్య, రాజానగరం వెంకటేష్, మండపేట వేగుళ్ళకు దక్కాయి. పార్లమెంట్ సీటు మురళి మోహన్ కోడలు రూపాదేవికి దక్కింది.

 

ఇందులో బుచ్చయ్య, వేగుళ్ళ విజయాలు సాధించారు. అయితే రాబోయే ఎన్నికల్లో బుచ్చయ్య పోటీ నుంచి తప్పుకుంటారని ఇప్పటికే ప్రకటించారు. అటు మురళి మోహన్ ఫ్యామిలీ కూడా ఎంపీగా బరిలో దిగడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో వెంకటేష్, వేగుళ్ళ మాత్రమే బరిలో ఉండే అవకాశముంది. కాకపోతే రాజమండ్రి పరిధిలో తమ డామినేషన్ తగ్గిపోతే ఒప్పుకోవడానికి కమ్మ నేతలు సిద్ధంగా లేరు.

 

ఒకవేళ బుచ్చయ్య తప్పుకోకుండా ఉంటే సమస్యలేదు. అలా కాకుండా ఆయన తప్పుకుంటే ఆ స్థానంలో మళ్ళీ మరో కమ్మ నేత ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ తీసుకొస్తారు. కుదిరితే బుచ్చయ్య సోదరుడు కుమారుడు డా. గోరంట్ల రవి రామ్ కిరణ్‌కు టిక్కెట్ దక్కొచ్చు. అటు రాజమండ్రి పార్లమెంట్ సీటు నుంచి రూపా దేవి తప్పుకున్న, ఆ స్థానంలో మరో కమ్మ నేతకు ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చింది. మొత్తానికైతే తూర్పులో తమ తమ స్థానాల్లో కమ్మల డామినేషన్ నడవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: