అసలే కరోనా కాలం.. అందులోనూ వర్షాలు జోరందుకుంటున్నాయి. ఇక ఈ వర్షాలకు జ్వరం, జలుబు, దగ్గు అత్యంత సహజం. అయితే మరి ఈ జలుబు, దగ్గు రొటీన్ గా వచ్చే సమస్యలా లేక కరోనా కారణంగా వచ్చినవా అని తేల్చుకోవడం మనుషులకు ఎప్పుడూ కష్టమే. అందుకే.. అసలైన కారణం తెలుసుకునేందుకు ఏపీ సర్కారు ఓ యాప్ ను రూపొందించింది.

 

 

కోవిడ్ 19 ఏపీ యాప్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖను ఆన్ లైన్ లో అడిగితే చాలు . యాప్ లో అడిగిన మేరకు చిరునామా , ఇతర వివరాలు నమోదు చేయగానే సమీపంలో ఉన్న ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రం , వైద్యుని పేర్లను తెలియచేస్తూ , అతని చరవాణికి ఎస్ఎంఎస్ వస్తుంది. వైద్యుడిని సంప్రదించిన వెంటనే నమూనా సేకరిస్తారు . మళ్లీ ఇలా ఎవరైనా అనుమానిత లక్షణాలతో ఉండి పరీక్షలు చేయించుకోవాలనుకునే వారికి వైద్య ఆరోగ్య శాఖ తగిన ఏర్పాట్లు చేస్తోంది .

 

 

ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఆ యాప్ లో మీ వివరాలు నమోదు చేసుకోవడమే. కరోనా అనుమానిత లక్షణాలైన జ్వరం , జలుబు , దగ్గు , గొంతు నొప్పి , శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నా కొందరు వైద్యులను సంప్రదించండి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసిన నమూనాలను తిరుపతి స్విమ్స్ లో మాత్రమే పరీక్షించేవారు. కానీ ఇప్పుడు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ పరీక్షలు అందుబాటులోనికి వచ్చాయి.

 

 

ఈ యాప్ కారణంగా ఇక కరోనా గురించి ఎవరినీ అడగక్కర్లేదు. ఇంకా అనేక సౌకర్యాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ అంటే సినిమాలు, వినోదమే కాదు.. ఇంకా పరిశీలించాల్సినవి చాలా ఉన్నాయి. పదండి వాటిని పరిశీలిద్దాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: