ప్రపంచదేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పలు దేశాలు కరోనాను నియంత్రించడంలో సఫలమవుతున్నా భారత్ లో మాత్రం వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ దేశంలో దాదాపు పదివేల కేసులు నమోదవుతున్నాయి. 
 
చైనా దేశంలోని వుహాన్ లో పుట్టిన ఈ మహమ్మారి పేరు వింటే ప్రజలు గజగజా వణకాల్సిన పరిస్థితి నెలకొంది. శాస్త్రవేత్తలు కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో వైరస్ కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక సంస్థ 8 లక్షల మందిపై అధ్య‌య‌నం చేసి ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారు వైరస్ కు అంతగా ప్రభావితం కావడం లేదని తేల్చింది. 
 
మిగతా బ్లడ్ గ్రూపులతో పోల్చి చూస్తే ఓ బ్లడ్ గూప్ కలిగిన వారిలో 9 నుంచి 18 శాతం మంది మాత్రమే వైరస్ భారీన పడుతున్నారని అధ్యయనంలో తేలింది. తమ అధ్యయనంలో పూర్తి ఫలితాలు ఇంకా రాలేదని.... మూడు నెలల క్రితం చేసిన పరిశోధనల్లో సైతం ఇలాంటి ఫలితాలే వచ్చాయని సంస్థ చెబుతోంది. ఓ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు తక్కువ సంఖ్యలో వైరస్ భారీన పడుతుంటే ఏ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు ఎక్కువగా వైరస్ భారీన పడుతూ ఉండటం గమనార్హం. 
 
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటివరకు పూర్తిస్థాయి ఫలితాలు రాబట్టే వ్యాక్సిన్ ఐతే అందుబాటులోకి రాలేదు. వైరస్ తన రూపాలను మార్చుకుంటూ ఉండటంతో ఖచ్చితమైన ఫలితాలను రాబట్టడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు కరోనా రోగులందరిలో ఒకే తరహా లక్షణాలు కనిపించడం లేదు. 23 అండ్ మీ అనే జెనెటిక్ టెస్టింగ్ ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారు కరోనాకు ప్రభావితం కావడం లేదని అధ్యయనం చేసి తేల్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: