ఇండియాలో నాలుగో దశ లాక్ డౌన్ ఆంక్షలు సడలింపులు తర్వాత వైరస్ వేగంగా విస్తరిస్తోంది. అంతకుముందు పాజిటివ్ కేసులు రోజుకి రెండు వేల లోపు నమోదుకాగా, ప్రస్తుతం రోజుకి పదివేల లోపు దగ్గరలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఉన్న కొద్ది వైరస్ ప్రభావం ఇండియా లో చాలా ప్రమాదకరంగా మారుతోందని వైద్య నిపుణులు అంటున్నారు. మరోపక్క ప్రపంచ స్థాయిలో కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం పేరుగాంచిన శాస్త్రవేత్తలు మరియు యూనివర్సిటీల అధ్యాపకులు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో పతాంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ బంగారం లాంటి వారు చెప్పుకొచ్చారు. మహమ్మారి కరోనా వైరస్ నీ అంత‌మొందించ‌గ‌ల వ్యాక్సిన్ సిద్ధంగా ఉంద‌ని ప్ర‌క‌టించారు.

IHG

తన దగ్గర ముందు సిద్ధంగా ఉందని ఆ మెడిసిన్ వల్ల వ్యాధి నుంచి కోలుకోవడం చాలా ఈజీ అని రాందేవ్ తెలిపారు. గిలోయ్ , అశ్వగంధ కాంబినేష‌న్ తో క‌రోనాకి చికిత్స చేయవచ్చునని రామ్ దేవ్ బాబా సూచించారు. ప్రమాదకరమైన ఈ కరోనా వైరస్ శరీరంలో ప్రవేశించి మొత్తం కణాల వ్యవస్థను నాశనం చేసే విధంగా పనిచేస్తోంది. శరీరంలో ఉన్న ఇతర కణాలకు సోకుతుంది. ఇలాంటి తరుణంలో అశ్వగంధ మరియు గిలోయ్ కామినేషన్ లో మెడిసిన్ తీసుకుంటే శరీరంలోపల కరోనా వైరస్ గొలుసును విచ్ఛిన్నం చేయడంలో 100% ప్రభావితంగా పనిచేస్తాయి అని చెప్పుకొచ్చారు.

IHG

ఈ క్రమంలో కరోనా రోగులకు గిలోయ్, అశ్వగంధ, తులశివతి ఖాళీ కడుపుతోనూ, తిన్న తరువాత కూడా ఇచ్చామని చెప్పారు. ఫలితంగా 100 శాతం రికవరీ, జీరో శాతం మరణ రేటు ఉందని తెలిపారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ కి వెళ్లాయని అంతా సక్సెస్ అయితే త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని రాందేవ్ బాబా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: