ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కి అవినీతి ఆస్తులు ఉన్నట్టు మీడియా ముందు సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఏదో విధంగా టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి తాజాగా సరికొత్త పోరాటంతో రెడీ అవుతున్నాడు. ఇటీవల ఉద్యోగాల నియామకం పై టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసిఆర్ కి సూటి ప్రశ్నలు వేశారు. డిప్యూటీ తహసీల్దారు గా సెలెక్ట్ అయిన యువతీ నియామక ఉత్తర్వులు మరియు ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఏడు నెలలు గడుస్తున్నా గాని ఇంకా పోస్టింగ్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు అని తన ఆవేదనను సదరు యువతీ మీడియా పత్రిక ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని లేవనెత్తారు రేవంత్ రెడ్డి. ఇలా సెలెక్ట్ అయిన వారు రాష్ట్రం లో చాల మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు ఉపాధి లేక కూలిపని చేసుకుంటూ బతుకుతున్నారు అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పై సీరియస్ అయ్యారు.

 

సెలెక్ట్ అయిన వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాళ్ల జీవితాలు అటూ ఇటూ కాకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని, డిప్యూటీ తహశీల్దార్ లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూలిపని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన సొంత కొడుకు కి ఇంటిలో ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో శ్రద్ధ చూపే కేసిఆర్ కి తెలంగాణ బిడ్డల ఉద్యోగాల విషయంలో శ్రద్ధ లేదు అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని… దీనిపై ప్రభుత్వం సరైన చొరవ తీసుకోకుండా ఉంటే విషయం సీరియస్ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో సెలెక్ట్ అయిన విద్యార్థులతో కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సరికొత్త పోరాటం చేయడానికి డిసైడ్ అయినట్లు వార్తలు అందుతున్నాయి. మరి ఈ విషయంలో కేసిఆర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: