ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ తప్పు ఎప్పుడు చేస్తే అప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దామని ప్రతిపక్షాలతో పాటు బీజేపీ పార్టీ కూడా ఎప్పటినుండో వెయిట్ చేస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో హైదరాబాదులో మీడియా సమావేశంలో బీజేపీ పార్టీ కీలక నేత రామ్ మాధవ్ ఘాటు విమర్శలు చేశారు. కేంద్రంలో మోడీ సర్కార్ అభివృద్ధి మంత్రంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ రివర్స్ మంత్రంతో ఏపీ అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్తున్నారని విమర్శలు చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని రివర్సే. ఆంధ్రప్రదేశ్ రాజధాని తో మొదలైన రివర్స్ రాజకీయాలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు రివర్స్, ఇంకా అనేక విషయాల్లో ఏపీ ప్రభుత్వం రివర్సే అన్నట్టుగా వ్యవహరిస్తోందని విమర్శలు చేశారు.

 

టీటీడీ భూముల విషయంలో హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న ప్రభుత్వం దేశంలో ఇంకెక్కడా లేదని చెప్పుకొచ్చారు. ఇదే టైములో బెయిల్ మీద ఒకాయన ఉంటే, బెయిల్ కోసం తయారీలో ఇంకొకాయన ఉన్నారు.’ అని రాంమాధవ్ ఓ రేంజిలో జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా రాంమాధవ్ వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి కేంద్రానికి ఆదాయం రాకపోయినా గాని.. ఎప్పటికప్పుడు కేంద్రం రాష్ట్రానికి నిధులు అందిస్తూ ఆదుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.10,000 కోట్లు ఏపీకి కేంద్రం ఇచ్చిందని చెప్పారు.

 

స్థానిక సంస్థల కోసం రూ.3,900 కోట్లు ఇచ్చామన్నారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ రిలీఫ్ కింద రూ.1,100 కోట్ల పై చిలుకు డబ్బులు చెల్లించామన్నారు. దీంతో మొట్టమొదటిసారి బీజేపీ నుండి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు రావడం తో జగన్ కి  వ్యతిరేకంగా పనిచేసే ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఈ న్యూస్ వైరల్ చేస్తున్నారు. మరోపక్క ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పరిపాలన పై అన్ని విధాలుగా సానుకూల వాతావరణం ఉండటంతో బీజేపీ అధికార ప్రతినిధి రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. ఆయన చేసిన ఆరోపణలు జగన్ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా తీసుకున్న నిర్ణయాలు కాబట్టి ప్రస్తుతం అవి ఏమాత్రం ప్రజలను ప్రభావితం చేసేవి కాదని అభిప్రాయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: