2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు వారసుడిగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు నారా లోకేష్. పార్టీ తరపున ఎమ్మెల్సీ గా ఎన్నికై వెంటనే రెండు శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాజకీయాల్లో కీలకంగా రాణించడం జరిగింది. అయితే ఆయన వ్యవహరించిన తీరు, బహిరంగంగా ప్రజలతో, వేదికలపై ఆయన మాట్లాడిన విధానం చూసి చాలా మంది టీడీపీ పార్టీకి చెందిన సీనియర్సే లోకేష్ పాలిటిక్స్ కి ఆన్ ఫిట్ అనే అభిప్రాయానికి వచ్చేయడం జరిగింది. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని నడిపించే సత్తా నారా లోకేష్ కి ఏమాత్రం లేదని చాలా మంది ఇటీవల ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత జంపింగ్ నేతలు కూడా కామెంట్ చేసి వేరే పార్టీలోకి వెళ్ళటం మనందరం చూసాం.

IHG

ఆ విధమైన అభిప్రాయం నారా లోకేష్ పై పార్టీలో ఉన్న వారికే ఉంటే మరోపక్క బాలయ్యకి మాత్రం తన అల్లుడు మాత్రమే ఎదగాలి అనే కాన్సెప్టుతో ఆలోచిస్తున్నట్లు ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం టీడీపీ మునిగిపోతున్న పడవ లాగా ఉందని ఈ టైం లో పార్టీని ఆదుకోవాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే అని చాలా మంది కార్యకర్తలు పార్టీలో ఉన్న నాయకులు అంటున్నారు.

IHG

కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లోకేష్ రాజకీయ ప్రస్తావన గురించిన బాలకృష్ణ మాత్రం పార్టీని ముందుకు నడిపించే పూర్తి సత్తా నారా లోకేష్ కి ఉందని,  సమర్ధుడు అని, ఎన్నో దేశాలలో అమలయ్యే ప్రభుత్వ కార్యక్రమాలను స్టడీ చేసి మరీ టీడీపీ మేనిఫెస్టో విషయంలో అహర్నిశలు కృషి చేస్తాడని, పైగా విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాడు లోకేష్ భవిష్యత్ నాయకుడు అన్నట్టుగా బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే నారా లోకేష్ అసమర్ధుడు అని వస్తున్నా వ్యాఖ్యలలో ఏ మాత్రం వాస్తవం లేదని వాటిని రాజకీయ విమర్శలు గానే చూడాలి అని అల్లుడు పై తన ప్రేమను చాటుకున్నారు బాలయ్య బాబు. 

మరింత సమాచారం తెలుసుకోండి: