బాలకృష్ణ భోళా మనిషి. బాలకృష్ణ కొన్ని సందర్భాల్లో ఆవేశపూరితంగా మరికొన్ని సందర్భాల్లో చాలా ప్రశాంతంగా కలుపుగోలుగా ఉంటారు. టాలీవుడ్ లో పదజాలంపై కమాండ్ ఉన్న వ్యక్తుల్లో బాలయ్య ఒకరు. బాలకృష్ణ జీవితంలో ప్రశంసలు, వివాదాలు రెండూ ఉన్నాయి. బాలకృష్ణ చేసిన సహాయం గురించి ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో కార్యకర్తలను కొట్టడం లాంటి వివాదాలు కూడా ఆయన జీవితంలో ఉన్నాయి. 
 
నందమూరి బాలకృష్ణ నిన్న షష్టిపూర్తి వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. నిన్న బాలయ్య 60వ వసంతంలోకి అడుగుపెట్టాడు. కరోనా విజృంభణ వల్ల పుట్టినరోజు నాడు తనను కలవడానికి ఎవరూ రావద్దని.... ఇంట్లోనే ఉండి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని బాలయ్య పిలుపునిచ్చాడు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలలో బాలకృష్ణ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. 
 
బాలకృష్ణ తాజాగా ఒక ఇంటర్వూలో తనకు తండ్రి ఎన్టీఆర్ అంటే ఎంతో భయమని చెప్పుకొచ్చారు. వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా షూటింగ్ సమయంలో ఒక సన్నివేశం కోసం టేకుల మీద టేకులు తీసుకుంటుంటే నాన్నగారు అందరిముందు తిట్టేశారని చెప్పారు. ఆ తర్వాత ప్రతి సీన్ లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. నాన్నగారి తర్వాత బ్రాహ్మణి అంటే చాలా భయమని చెప్పుకొచ్చారు. 
 
బ్రాహ్మణి చాలా బ్యాలెన్సుడ్ గా ఉంటుందని... ఏదైనా చాలా కూల్ గా చెబుతుందని అన్నారు. బ్రాహ్మణికి సహనం, ఓపిక చాలా ఎక్కువని.... తనకు రాజకీయాలంటే అస్సలు ఇష్టం లేదని... తన మనవడికి కూడా వాళ్ల అమ్మ అంటే చాలా భయం అని చెప్పుకొచ్చారు. బ్రాహ్మణి లాంటి పవర్ ఫుల్ వుమెన్ ఉండటం అటు లోకేష్ కైనా... ఇటు బాలకృష్ణకైనా అదృష్టమే అని చెప్పాలి.                 

మరింత సమాచారం తెలుసుకోండి: