కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్ కేంద్రం ప్రవేశపెట్టబోయే విద్యుత్ బిల్లు గురించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోదీకి ఘాటైన లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జగన్ కూడా సీఎం కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారు. జగన్ కూడా మోదీకి షాక్ ఇస్తూ అదే తరహా ఘాటైన లేఖ రాశారు. విద్యుత్ బిల్లు వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోకుండా ఉండాలని కోరుతూ సీఎం జగన్ లేఖ రాశారు. 
 
అయితే వాస్తవంగా ఏపీ వల్లే విద్యుత్ బిల్లులకు సంబంధించిన వివాదం తలెత్తింది. గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల నష్టం జరుగుతోందని.... ఆ ఒప్పందాల రద్దు దిశగా జగన్ గతంలో ప్రయత్నాలు చేశారు. అయితే విదేశీ ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటే ఇతర విదేశీ పెట్టుబడులు కూడా ఆగిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 
 
ఈ వ్యవహారం వల్ల కేంద్రం మొదట్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలంటే పెనాల్టీ వేయాలని భావించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల విషయంలో కీలకంగా వ్యవహరించేలా కేంద్రం విద్యుత్ బిల్లులో సవరణలు చేసింది. సీఎం జగన్ ఈ సవరణలు ప్రైవేట్ ఉత్పత్తిదారులకు అవసరానికి మించి రక్షణ కలిగిస్తుందని... కరెంట్ కొనుగోలు రేట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. 
 
దేశమంతా ఒకే టారిఫ్ సాధ్యం కాదని.... కమిషన్ల సభ్యుల నియామకాలకు సంబంధించి రాష్ట్ర హక్కులు గుంజుకోవద్దని పేర్కొన్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో విద్యుత్ చట్టంలో సవరణలు తీసుకొస్తూ సంస్కరణలకు ఆమోదం తెలిపిన రాష్ట్రాలే నిధులు ఇస్తామని ప్రకటన చేసింది. కేంద్రం గత రెండు నెలల్లో 8,000 కోట్ల రూపాయలు జమ చేసింది. అయితే తాజాగా జగన్ విద్యుత్ సంస్కరణలు ఆమోద యోగ్యం కాదంటూ లేఖ రాయడం గమనార్హం.      

మరింత సమాచారం తెలుసుకోండి: