అధికారం కోల్పోయిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఏదొరకంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ...ప్రతి పథకంపైన విమర్శలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అసలు ఏ విషయం వదలకుండా బాబు రాజకీయ లబ్ది పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వంపై నెగిటివ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

 

తాజాగా కూడా వైసీపీ ఈ ఏడాదిలో అనేక కుంభకోణాలకు పాల్పడిందంటూ విమర్శలు చేశారు. మద్యం, ఇసుక, గనులు, భూసేకరణ, కరోనా కిట్లు, బ్లీచింగ్‌లో కుంభకోణాలకు పాల్పడ్డారని, వైసీపీ అవినీతిని చార్జిషీట్‌ పేరుతో టీడీపీ బట్టబయలు చేసిందని మాట్లాడారు. అయితే బాబు ఎన్ని ఆరోపణలు చేసినా...ప్రజలు మాత్రం జగన్‌నే నమ్ముతున్నారు. ఆయన అమలు చేస్తున్న పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పైగా రోజురోజుకూ టీడీపీనే వీక్ అవుతుంది. ఆ పార్టీ నేతలు వరుస పెట్టి వైసీపీలోకి వెళ్లిపోతున్నారు.

 

ఇదే సమయంలో వైసీపీ అవినీతి బట్టబయలు అయిందని బాబు ఆరోపణలకే పరిమితం అవుతుంటే...జగన్ మాత్రం గత ఐదేళ్లలో టీడీపీ చేసిన అక్రమాలని వెలికితీసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు అంశాల్లో టీడీపీ ప్రభుత్వంపై విచారణలకు ఆదేశించారు. ఇక తాజాగా గత చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన కొన్ని కీలక కార్యక్రమాలపై సి‌బి‌ఐ విచారణకు సిఫారసు చేశారు. ఫైబర్ నెట్లో సుమారు రూ.700 కోట్ల మేర అవినీతి జరిగిందని, అలాగే సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా వంటి స్కీమ్‌ల ద్వారా రూ.158 కోట్ల అవినీతికి పాల్పడినట్లు మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో స్పష్టం చేసింది. అటు హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40 కోట్లు ఖర్చు చేసినట్టుగా ఉపసంఘం నివేదికలో పేర్కొంది.

 

అయితే పక్కా ఆధారాలతోనే జగన్ ప్రభుత్వం వీటిపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఒకవేళ విచారణలో ఇదే నిజమని తేలితే బాబు బుక్ అయినట్లే... అలాగే వీటితో సంబంధం ఉన్న మంత్రులు, అధికారులు కూడా ఇబ్బంది పడటం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికైతే వైసీపీ అవినీతి బట్టబయలు చేశామని బాబు చెబుతుంటే రివర్స్‌లో ఆయనకే జగన్ షాక్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: