టెక్నాలజీని కనిపెట్టింది నేనే... అసలు టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్ నేనే అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు టిడిపి అధినేత చంద్రబాబు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ నూతన ఆవిష్కరణ జరిగిన దాంట్లో తన హస్తం ఉంది అన్నట్లుగా చంద్రబాబు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా ప్రతి దశలోనూ సాంకేతిక పరిజ్ఞానం గురించి చంద్రబాబు మాట్లాడుతూ ఉంటారు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ తో చంద్రబాబు హైదరాబాద్ లోని తన ఇంటికి పరిమితం అయిపోయాడు. ఇక అప్పట్నుంచి పార్టీ సభలు-సమావేశాలు ఇలా ఏదైనా ఆన్లైన్ ద్వారానే చేస్తూ, సరికొత్త రీతిలో పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతియేటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుని సైతం జూమ్ యాప్ ద్వారా నిర్వహించి సరికొత్త రికార్డును చంద్రబాబు సృష్టించారు.

IHG

 ఈ తరహా విధానం తో అన్ని రకాలుగా కలిసి వస్తుండడంతో చంద్రబాబు దీనిపైన దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోనే  ఉన్నారు. పార్టీ క్యాడర్ ఎవరికీ ప్రత్యక్షంగా అందుబాటులో లేరు. మొత్తం అన్ని కార్యకలాపాలు ఆన్లైన్ ద్వారా మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో టిడిపి రాజకీయ ప్రత్యర్దులయిన అధికార పార్టీ వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎక్కడ ఉందని, ఇప్పుడు ఉన్నది ఆన్లైన్ పార్టీ అంటూ హేళన చేస్తున్నారు. మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు వారసుడు నారా లోకేష్ ప్రత్యక్షంగా జనాల్లోకి రాకపోయినా, సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా  ఉంటూ వస్తున్నారు. దీంతో టిడిపి రాజకీయ ప్రత్యర్థులు అంతా లోకేష్ ను హేళన చేస్తూ మాట్లాడేవారు.

 

IHG's Mahanadu On Zoom App! | Gulte - Latest <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA PRADESH' target='_blank' title='andhra pradesh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>andhra pradesh</a> ...


 కానీ ఇప్పుడు చంద్రబాబు కూడా మొత్తం అన్ని కార్యకలాపాలు ఆన్లైన్ ద్వారానే నిర్వహిస్తూ పార్టీ సమావేశాలు, నాయకులతో మీటింగ్ అన్నీ, ఆన్లైన్ ద్వారానే చేస్తున్నారు. ఈ తరహా విధానం బ్రహ్మాండంగా ఉంది అనేది చంద్రబాబు నమ్మకం. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు మాత్రం ఈ విధానం పై పెదవి విరుస్తున్నారు. నాయకుడనేవాడు జనాల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా పోరాటాలు చేయాలి తప్ప ఆన్లైన్, సోషల్ మీడియా ద్వారా రాజకీయాలు చేద్దాం అనుకుంటే అది కుదరని పని అని, ఇదే బాగుంది అనుకుని ముందుకు వెళ్తే బొక్క బోర్లా పడడం ఖాయమని వారు సూచిస్తున్నారు.


 కేవలం పట్టణ ప్రణతాల్లోని ప్రజలు, విద్యావంతులు మాత్రమే ఆన్లైన్లో లో రాజకీయాలకు ప్రభావితం అవుతారు కానీ, మెజారిటీ జనాలు ఆన్లైన్ విధానాన్ని పట్టించుకోరని సూచిస్తున్నారు. టిడిపి ఆన్లైన్ పార్టీ అంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే  సిధిరి అప్పలరాజు వంటివారు కామెంట్ చేస్తున్నా.. తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో టీడీపీ ఉంది. చంద్రబాబు వయసు రీత్యా మరికొంత కాలం హైదరాబాదులో ఉండాల్సిందే. అందుకే ఆన్లైన్ కి  ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ఈ విధానంపై తెలుగు తమ్ముళ్లు మాత్రం పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: