కరోనా వైరస్ తన ఉనికిని మొదలు పెట్టిన రోజు నుండి చిన్న-పెద్ద, పేద-ధనిక, ప్రముఖుడు-సామాన్యుడు అనే వివక్ష లేకుండా నిష్పక్షపాతంగా అందరినీ కబళిస్తున్న తీరుని చూస్తూనే ఉన్నాం. ఇక భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒకలాగా దెబ్బతీసిన మహమ్మారి మొత్తం దేశ ఆర్థిక గమనాన్నే మార్చి వేసిన విషయం తెలిసిందే. దీన్ని జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో రంగం ఏదైనా భవిష్యత్తులో కరోనా కు ముందు కరోనా కు తర్వాత అనే పేర్లతో ప్రస్తావించడం ఖాయంగా కనిపిస్తుంది.

 

ఇక వ్యక్తిగతంగా ప్రతి సామాన్యుడికి కరోనా వైరస్ ఎంతటి నష్టాన్ని కలిగించిందో ఒక లెక్క వేసుకోవచ్చు కానీ మొత్తం దేశాం దీని వల్ల ఎంత మూల్యం చెల్లించిందన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ప్రస్తావించారు. ఆయన అంచనా ప్రకారం కరోనా వైరస్ కారణంగా భారత్ 10 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది నిపుణులు చెప్పినట్లుగా గడ్కరీ వెల్లబుచ్చారు.

 

అంటే ఈ లెక్కన మన దేశంలో ఉన్న జనాభా ప్రకారం ఒక్కొక్క భారతీయుడికి సగటున రూ.7,500 నష్టం వాటిల్లిందన్నమాట. లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలపాటు భారతదేశంలో పూర్తిస్థాయి వ్యాపార మరియు వాణిజ్య రంగాలు మూతపడగా కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని చెబుతున్నారు. తాజా పరిణామాలతో రాబోయే రెండు మూడేళ్ళు భారత్ దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

దేశ జీడీపీ దాదాపు 200 లక్షల కోట్లు కాగా అందులో 10 శాతం అనగా 20 లక్షల కోట్లు పరిశ్రమల కోసం రైతుల కోసం ప్రస్తుతం కేటాయించారు. ఇకపోతే కేంద్రమంత్రి గడ్కరీ మాత్రం ప్రతికూల పరిస్థితిని భయంతోనో నిరాశతోనో ఎదుర్కోలేమని.... గుండె నిబ్బరం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇంకా సానుకూల వైఖరి ఉంటేనే మనం గండం నుంచి బయటపడవచ్చని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: