కాస్త అటూ ఇటుగా ఉన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు ఇద్దరే. ఇద్దరూ మొండివారే అని చెప్పాలి. తాము అనుకున్నది తప్ప, ఎవరు ఏమి చెప్పినా వినే రకం అయితే కాదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ విషయం గురించి చెప్పుకుంటే, జగన్ తాను ఎన్నికల ముందు ఏవిధంగా అయితే ప్రజలకు సుపరిపాలన అందించాలి అనుకున్నాడో ఆ విధంగా పరిపాలనను అందించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, ఎక్కడా సంక్షేమ పథకాలకు కోత విధించకుండా ముందుకు  తీసుకెళ్తున్నారు. కానీ జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలావరకు అనవసర రాద్ధాంతం అవ్వడం, అలాగే కోర్టులు కూడా తప్పుపడుతూ వస్తుండడం, ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 65 కేసులకు సంబంధించి కోర్టుల్లో  ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

IHG

 

 కాకపోతే జగన్ తీసుకున్న నిర్ణయాలు అన్నీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవే ఉన్నాయి. ముఖ్యంగా పేదలకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, ఇలా జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నారు. కాకపోతే ఆ నిర్ణయాలను అమలు చేసే క్రమంలో దొర్లుతున్న తప్పులు, తొందరపాటు కారణంగా ఏపీ ప్రభుత్వం ఎలా అభాసుపాలు కావస్తుంది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ పరిస్థితి కూడా ఇంతే. తెలంగాణ సీఎం కేసీఆర్  తీసుకుంటున్న నిర్ణయాలు ఇదే విధంగా అమలవుతూ వస్తున్నాయి.

 


 ఆ మధ్య జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె, పదవ తరగతి పరీక్షలు కరోనా కారణంగా వాయిదా వేయడం, ప్రస్తుతం పరీక్షలు నిర్వహించే విషయంలో కోర్టులు తప్పులు పట్టడం, ఇలా అన్ని విషయాలను తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టులు తప్పు పడుతూ వస్తున్నాయి. అయితే ఈ రాద్ధాంతం కేవలం ఈ రెండు రాష్ట్రాలకి పరిమితమైతే ఫర్వాలేదు కానీ ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వాలకు ఎదురవుతున్న ఇబ్బందులను తప్పుపడుతూ జాతీయ మీడియాలో ప్రధాన కథనాలుగా వస్తూ రెండు రాష్ట్రాల పరువు దేశవ్యాప్తంగా పోతోంది. అయితే ఇందులో ఎవరిది న్యాయం ? ఎవరిది అన్యాయం అనే విషయం పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: