గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంతుచిక్కని విషయం ఒక్కటే. మొదట్లో కనీసం వారానికి ఒకసారి అయినా ప్రెస్ మీట్ పెట్టి ఊదరగొట్టేసిన తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు సైలెంట్ అయిపోయాడు అని. అది కూడా కేసులు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అధిక మొత్తంలో బయటపడుతున్న సమయంలో.

 

ప్రస్తుతం మనం గమనించినట్లైతే తెలంగాణ సీఎం కేసీఆర్ అటు ప్రజల దగ్గర నుండి ఇటు ధర్మాసనం దగ్గర నుండి విపరీతమైన హీట్ ఎదుర్కొంటున్నాడు. గతంలో అంటే టెస్టులు జరపక రోజుకి 10, 20 లేదా అంతకన్నా తక్కువ కేసులు నమోదు అవుతుండగా ఇప్పుడు హాయిగా ప్రెస్ మోట్ లు పెట్టి నప్పని విషయాలను ప్రశ్నించే వారిని చెడామడా తిట్టారు.

 

కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. టెస్టుల సంఖ్య పెంచినప్పుడు రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడమే కాకుండా కుప్పలు తెప్పలుగా వస్తున్న పేషెంట్ లను హ్యాండిల్ చేయలేక పరిస్థితి విషమంగా ఉన్న పేషెంట్లకు ప్రత్యేక పర్యవేక్షణ ఇవ్వలేక వైద్యులు సతమతమవుతూ ఉండగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం కూడా ఇప్పుడు ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతోంది.

 

ఇప్పటికే కరోనా నిర్ధారణ టెస్టుల విషయంలో దేశంలోనే అట్టడుగున నిలిచిన తెలంగాణ రాష్ట్రం కొత్తగా మరొక అప్రతిష్టను మూటగట్టుకుంది. 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' ప్రకారం దేశంలో ఏప్రిల్ మరియు మే నెలలలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా పెరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు రెట్లు ఎక్కువగా నిరుద్యోగులు పెరిగారు అనగా ఉపాధి లేకుండా లక్షలాది మంది రోడ్డు మీద పడ్డారు.

 

ఇప్పటికే దేశంలోనే తమ రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్య శాఖకు అతి తక్కువ శాతం వెచ్చించిన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ బీహార్ కన్నా వెనుకబడగా….ఇప్పుడు బయటికి వచ్చినా నిజం చూస్తే సమయంలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్లో ఆందోళన తగ్గించాలని అందరూ అభిప్రాయ పడుతున్నారు. కానీ కెసిఆర్ సమయంలో ప్రెస్ మీట్ పెట్టకపోతే అతను నిజాలను ఎదుర్కోవడానికి భయపడుతున్నాడు అని విపక్షాలు దుమ్మెత్తి పోస్తారు. మరి సీఎం సాబ్ ఏం చేస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: