ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పథకాల అమలు గురించి తెలుసుకొనేందుకు సీఎం జగన్‌ పల్లెల్లో పర్యటించబోతున్నారు. ఆగస్టు నెలలో గ్రామాలకు వెళ్లి స్వయంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో వైకాపా పాలనకు ఏడాది పూర్తయింది. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా పరిశీలించాలని సీఎం జగన్ నిర్ణయించారు.

 

 

అందుకే ఆగస్టులో గ్రామాల్లో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా జగన్ అధికారులతో ఓ మాట చెప్పారు. ఇప్పుడు ఆ మాట అధికారుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇంతకీ జగన్ ఏం చెప్పారు.. అధికారులు ఎందుకు అంతగా భయపడుతున్నారు.. ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. పల్లెటూళ్లలో పథకాలు అందలేదంటూ ఎవరూ చేయి ఎత్తే పరిస్థితి కనిపించకూడదన్నారు.

 

 

అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై సమీక్షా సమావేశం సందర్భంగా జగన్ ఈ డైలాగ్ చెప్పారు. సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందకపోతే.. అందుకు అధికారులను బాధ్యులను చేస్తానని జగన్ వార్నింగ్ ఇచ్చారు. పింఛన్లు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ, రేషన్‌ కార్డుల జారీపై ముందుగా దృష్టి పెట్టాలని సూచించారు. సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూనే, వచ్చే సమాచారాన్ని విశ్లేషించి పర్యవేక్షణ చేయడమూ చాలా ముఖ్యమన్నారు.

 

 

ఎక్కడా అలసత్వానికి తావివ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ ఏడాది అమలు చేయనున్న పథకాల క్యాలెండర్‌ను అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని సీఎం ఆదేశించారు. అందుకే ఇప్పుడు అధికారులు మరోసారి లబ్దిదారుల జాబితాలు సరిచూసుకుంటున్నారు. జగన్ సమక్షంలో తమకు అక్షింతలు పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: