గత ఎన్నికల్లో ఘోర‌ ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు షాకుల మీద షాకులు త‌గులుతున్న సంగ‌తి తెలిసిందే. 2019 ఎన్నికల్లో దాదాపు టిడిపి పార్టీ పునాదులు కదిలిపోయేలా జ‌గ‌న్ విజ‌యం సాధించ‌డంతో.. పార్టీకి చెందిన పలువురు నేతలు ప‌క్క పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. ఇలా ఒక్కొక్క‌రిగా పార్టీని వీడుతంటే.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కి రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. 

 

ఇక ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను చూస్తుంటే.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ కూడా చంద్ర‌బాబును ప‌క్క‌న పెడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన మార్పు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వాస్త‌వానికి గ‌తంలో జ్యోతి ప్రతి రోజు గంట గంటకు వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు చేస్తూనే.. మ‌రోవైపు చంద్ర‌బాబుకి, టీడీపీకి డ‌ప్పు కొట్టేది. అందుకే ఏబీఎన్ రాధాకృష్ణను ప్రసన్నం చేసుకపోవడానికి ముందు వరుసలో టీడీపీ నాయకులు ఉంటారు. అయితే నిన్న ఏబీఎన్‌ పేపర్లో అసలు చంద్రబాబు ఫొటో కనీసం పాస్ పోర్ట్ సైజ్ లో కూడా కనిపించలేదు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలిచ్చారు కానీ ఓన్లీ రైటప్ మాత్రమే ఉంది. 

 

ఇక్క‌డ విచిత్రం ఏంటంటే.. బాబుకి బదులు ఫ్రంట్ పేజీ బీజేపీ నాయకులు ఆక్రమించారు. ఇక బాలయ్య పుట్టినరోజు వార్త విష‌యంలో కూడా చాలా జాగ్రత్తగా బాబుని తీసిపారేసి కేవలం వసుంధర, మోక్షజ్ఞతో కలసి బాలయ్య ఉన్న ఫొటోని సినిమా పేజీకి పరిమితం చేసింది. ఇదంతా చూస్తుంటే.. ఏబీ‌‌ఎన్ చంద్రబాబుకి ప్రయారిటీ తగ్గించేసి, బీజేపీని మోయడం మొదలుపెట్టిందంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంద‌రు. ఎందుకంటే వాస్త‌వానికి ఒక‌ప్పుడు చంద్ర‌బాబు ఫోటో లేకుండా జ్యోతి పేప‌ర్ వ‌చ్చేదే కాదు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబుకు జ‌నాల్లో క్రేజ్ త‌గ్గ‌డంతో.. రాధాకృష్ణ కూడా బాబును ప‌క్క‌న పెట్టి పెద్ద షాకిచ్చాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: