టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును శ్రీ‌కాకుళం జిల్లా టెక్క‌లిలో ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈఎస్ఐ మందుల కొనుగోలులో 150కోట్ల స్కాం జ‌రిగింద‌ని, ఇందులో నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉంద‌ని ఏసీబీ గుర్తించింది. మందుల కొనుగోలులో నామినేష‌న్ ప‌ద్ద‌తిలో మందులు కొన్నార‌ని, 150కోట్ల స్కాంలో 90కోట్ల స్కాం వ‌ర‌కు అచ్చెన్నాయుడుకు తెలిసే జ‌రిగింద‌ని ఏసీబీ గుర్తించింది. 

 

IHG

 

ఇంకా ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కొందరు రాజకీయ విశ్లేషకులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిక ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటినుండి వైఎస్ జగన్ ని టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా అందులో కీలక పాత్ర పోషించింది అచ్చెన్నాయుడు. 

 

IHG

 

ఉత్తరాంధ్ర యాస దానికి తోడుగా బలమైన వాయిస్ వుండడంతో మాటలకి చాలా స్ట్రాంగ్ పాయింట్ ఉండేది. ఎంతో తీవ్రమైనటువంటి వార్నింగ్ లు ఇచ్చే వారు.. తీవ్రమైనటువంటి విమర్శలు చేసేవారు. ఇంకా సీఎం జగన్ ని, విజయసాయి రెడ్డి పదే పదే ఏ1, ఏ 2 అంటూ తార స్థాయిలో విమర్శలు చేసేవాడు. 

 

IHG

 

అలాంటి అచ్చెన్నాయుడుపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు? లేక అయన చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడా అనేది పక్కన పెడితే అచ్చన్నాయుడు కూడా ఇంకా జీవితాంతం ఈఎస్ఐ కేసులో ఏ 1 ముద్దాయిగా మారుతున్నాడు? లేక ఏ 2 ముద్దాయిగా మారుతున్నాడా అనేది తెలియకపోయినప్పటికీ చివరికి అయితే రేపు అచ్చన్నాయుడుని అనాల్సి వస్తే ఖచ్చితంగా ఏ1 ముద్దాయి అని అంటారు. అయితే ఈ కేసులో ఎవరు ఏ 1, ఏ 2 అవుతారు అనేది పక్కన పెడితే కేసులో మాత్రం భారీ కుంభకోణం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: