దేశంలో ఎప్పుడైతే కరోనా వైరస్ కేసులు పెరగడం మొదలు పెట్టాయో అప్పటి నుంచి లాక్ డౌన్ ప్రకటించారు.  దాంతో విద్యావ్యవస్థ, వాణిజ్య వ్యవస్థ, రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ అయ్యాయి. ఎవరూ బయలకు వెళ్లడానికి వీళ్లేదని.. అత్యవసర వస్తువులకు మాత్రమే పరిమిషన్ ఇచ్చారు.  దాంతో ఎంతో మంది ఉపాది కోల్పోయారు.. ప్రభుత్వం ఆదుకుంటున్నా.. ఇల్లు గడిచే పరిస్థితిలో లేని ఎంతో మంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. అలాంటి వారిలో ఓ ఉపాధ్యాయుడు  కుటుంబ పోషణకు తోపుడు బండి పై అరటి పండ్లను అమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది కాస్త నేషనల్ లెవెల్లో వైరల్ అయ్యింది.

IHG

నెల్లూరు నగరంలోని వేదాయపాళెం గ్రామం లో  ఉంటున్న పట్టెం వెంకటసుబ్బయ్య (ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, ఎంఏ తెలుగు, బీఈడీ పూర్తిచేసి) 2008 నుంచి ప్రైవేటు కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అయితే చిన్నప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి పూర్వ విద్యార్థులు అతనికి అండగా నిలిచారు. విద్యా బుద్దులు చెప్పిన వ్యక్తి రోడ్డుపై అరటి పండ్లు అమ్ముకుంటున్న దృశ్యాలు చూసి చలించి పోయారు. తాము పై స్థాయికి రావడానికి కారణమైన  ఆయన రుణం తీర్చుకోవాలని అనుకున్నారు.  అందరూ సోషల్ మాద్యమాల ద్వారా కలుసుకొని తమ గురువు రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తమ వంతు తక్షణ సాయంగా రూ. 86 వేలు అందజేశారు. 

IHG

విద్యార్థులు అతనిపై చూపిన గౌరవానికి అతడు పొంగిపోయాడు. నిజంగా ఇప్పటికీ ఇంకా మానవత్వం ఉందని.. విద్య చెప్పిన గురువును కొంత మంది మర్చిపోతున్న ఈ తరుణంలో తాను చదువు చెప్పిన పూర్వ విద్యార్థులు నిండు మనసుతో తనకు సాయమందించడం ఆ మాస్టారు ఎంతో గొప్ప ఆనందాన్ని పోందారు.  కరోనా సమయంలో కష్టాలు పడుతున్న వారికి మన వంతు సాయం అందిస్తే ఆ దేవుడు చల్లగా చూస్తారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: