దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని ముప్పుతిప్పలు వైయస్ జగన్ పెడుతున్నారని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధంగా టీడీపీ ఏనాడు సంక్షోభం ఎదుర్కోలేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకంగా రాణించిన సీనియర్ రాజకీయ నేతలు ప్రస్తుత పరిణామాలను బట్టి వ్యాఖ్యానిస్తున్నారు. వైయస్ జగన్ ఈ విధంగానే దూకుడుగా వెళితే 2024 ఎన్నికలకు టీడీపీ పార్టీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలను ఒక్కొక్కరుగా టార్గెట్ చేసుకుని జగన్ చేస్తున్న రాజకీయాలు… ఆ పార్టీ పునాదులను కదిలిస్తున్నట్లు పరిశీలకులు కూడా అంటున్నారు. 2019 ఎన్నికల రిజల్ట్ దెబ్బ తర్వాత చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా వైయస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని…, ఇదే రీతిలో బాబు హయాంలో జరిగిన అవినీతిని బయట పెడుతున్నారు అని వ్యాఖ్యానిస్తున్నారు.

IHG

ఒకపక్క సంక్షేమంతో ప్రజలను ఆకట్టుకుంటూనే మరోపక్క రాజకీయ ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీకి భవిష్యత్తు లేకుండా జగన్ ఫుల్ స్పీడ్ రాజకీయం చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు హయాంలో కార్మికశాఖ మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు అరెస్టుతో జగన్ దూకుడు ఆగే పరిస్థితి లేదని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు అని చెప్పుకునే నాయకుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫైబర్ గ్రిడ్ పేరిట చంద్రబాబు హయాంలో ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఆధ్వర్యంలో భారీ స్కాం జరిగినట్లు ఇప్పటికే మంత్రి పేర్ని నాని స్పష్టం చేయడం జరిగింది.

IHG

ఈ భారీ స్కాం  డీల్ చెయ్యడం లో భాగంగా త్వరలో సి.బి.ఐ విచారణ చేయించటానికి జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో వైయస్ జగన్ చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు కేంద్ర స్థాయిలో ఫైబర్ గ్రిడ్ పేరిట జరిగిన స్కాం బయటపెట్టాలని ఆలోచిస్తున్నట్లు వైసీపీ పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జరిగిన అవినీతి లావాదేవీల విషయం ఎక్కువగా నారా లోకేష్ చుట్టే జరిగినట్లు దీంతో వైయస్ జగన్ నెక్స్ట్ టార్గెట్ నారా లోకేష్ అన్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: