ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఒకటే  హాట్ టాపిక్ అదే టీడీపీ కీలక నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్. 150 కోట్ల ఈఎస్ఐ స్కాంలో అచ్చన్నాయుడు పాత్ర ఉందని విజిలెన్స్ అధికారులు తేల్చడంతో ప్రస్తుతం అచ్చన్నాయుడు ని  అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇలా టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడం ఆంధ్ర రాజకీయాలలో పెద్ద దుమారమే రేపుతోంది. అయితే అచ్చం నాయుడు అరెస్టు పై అటు టిడిపి పార్టీ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ... గతంలో చంద్రబాబు అవినీతి పాలన అంటూ విరుచుకు పడుతున్నారు. అచ్చన్నాయుడు అరెస్ట్ పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. 

 


 ఇక తాజాగా టీడీపీ కీలక నేత మాజీ మంత్రి అయిన అచ్చన్నాయుడు అరెస్ట్ పై స్పందించిన జనసేన పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాం లో అవినీతికి పాల్పడ్డారు అని  అరెస్టు చేసారా లేదా జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా అచ్చన్నాయుడు ను  అరెస్టు చేయించిందా  అంటూ తాజాగా జనసేన కీలక నేత అయిన నాదెండ్ల మనోహర్ అధికార పార్టీ పై  ప్రశ్నల వర్షం కురిపించారు. అచ్చన్నాయుడు అరెస్టు విషయంలో జగన్మోహన్రెడ్డి సర్కార్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన  అవసరం ఎంతైనా  ఉంది అంటూ ఆయన డిమాండ్ చేశారు. 

 


 అచ్చెన్నాయుడు అరెస్ట్ ను జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అంటూ వ్యాఖ్యానించి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్... దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ కోరారు. ఒక శాసన సభ్యుడిని  అరెస్టు చేసే ముందు రాజ్యాంగబద్ధమైన నిబంధనలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని   దీనిని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి అంటూ తెలిపారు. కానీ ఒక శాసన సభ్యుడు అయిన అచ్చన్నాయుడు అరెస్టు విషయంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్  ఇలాంటి రాజ్యాంగబద్ధమైన నిబంధనలు పాటించలేదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది అంటూ విమర్శలు గుప్పించారు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్. ఈఎస్ఐ స్కామ్ లో జరిగిన అవకతవకల తో  పాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలను చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి  సర్కార్ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు నాదెండ్ల మనోహర్.

మరింత సమాచారం తెలుసుకోండి: