స్టాక్ మార్కెట్ అంటేనే ఎప్పుడు ఒడిదుడుకులు వ‌స్తాయో తెలియ‌దు..ఎప్పుడు లాభాలు గుమ్మ‌రిస్తాయో ఓ ప‌ట్టాన అర్థం కాదు...ఎప్పుడు ఎందుకు న‌ష్టాలు సంభ‌విస్తాయో కూడా అంత ఈజీగా తెలియ‌దు. అయితే చాలామంది స్టాక్ మార్కెట్ అంటే పేకాట అంటూ దాని స్థాయిని చాలా దిగ‌జార్చి మాట్లాడుతుంటారు. వాస్తవానికి మార్కెట్ ఒడిదుడుకుల‌కు అనేక ప‌రిణామాలే కార‌ణ‌మై ఉంటాయ‌న్న‌ది వాస్త‌వం. లాజిక్ లేకుండా ఒక్క పైసా కూడా పెట్టుబ‌డిగా మార‌దు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే. గ‌త కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు అనుహ్య లాభాల‌ను..అనుహ్య న‌ష్టాల‌ను చ‌విచూస్తున్న విష‌యం తెలిసిందే. 

 

ఈ త‌ర‌హాలోనే శుక్ర‌వారం సైతం భారీ న‌ష్టాల నుంచి ఒక్క‌సారిగా పుంజుకుని లాభాల్లోకి మార్కెట్లు ప‌య‌నించాయి. అదే స‌మ‌యంలో గురువారం న‌ష్టాలు మిగిలాయి. అంత‌కు ముందు రోజు లాభాలు....మ‌రి కొద్దిరోజుల క్రితం వ‌రుస‌గా న‌ష్టాలు స‌మ‌కూరాయి. ఇలా కొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్లు స‌ముద్రంలోని అల‌ల ఎగిసిప‌డుతూ వ‌స్తున్నాయి. ఇక ఆ విష‌యం వ‌దిలేస్తే శుక్ర‌వారం  దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకుని లాభాల్లో ముగిసాయి. ఆరంభంలో 1100 పాయింట్లకుపైగా  కోల్పోయిన సెన్సెక్స్ మిడ్ సెషన్ నుంచి భారీ రికవరీ సాధించింది. చివరికి 243 పాయింట్లు ఎగిసి 33781 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 9972 వద్ద ట్రేడింగ్‌ను ముగించేశాయి. 

 

ఈ ప‌రిణామం పెట్టుబ‌డుదారుల్లో సంతోషాన్ని నింపింది. బ్యాంకింగ్ ఆటో సహా అన్ని రంగాల షేర్లలో క‌ద‌లిక‌లు పెరిగాయి. ఈ రోజు  కనిష్టం నుంచి సెన్సెక్స్ 1433  పాయింట్లు, నిఫ్టీ  429 పాయింట్లు ఎగిసాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, వేదాంత, సన్ ఫార్మా, బీపీసీఎల్, ఎం అండ్ ఎండ్, హీరో మోటో, భారతి ఇన్‌ఫ్రాటెల్, భారతి ఎయిర్‌టెల్ వంటి సంస్థ‌లు భారీ లాభాల‌ను సంపాదించాయి. అయితే హెచ్1బీ వీసా జారీ తాత్కాలిక రద్దు వార్తలతో ఐటీ షేర్లు  అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.  అదే విధంగా నిప్టీ బ్యాంకు 1128 పాయింట్లు పుంజుకోవడం విశేషం. దీంతో నిఫ్టీ తిరిగి 9950 పాయింట్ల ఎగువకు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: