టీడీపీ కీలక నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు ప్రస్తుత ఆంధ్రా రాజకీయాల్లో  సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. ఈఎసై స్కామ్  విషయంలో అవినీతి జరిగిందనే ఆరోపణల్లో  టీడీపీ కీలక నేత అచ్చన్నాయుడు పాత్ర ఉందని విజిలెన్స్ అధికారులు విచారణలో తేల్చారు. ఈమేరకు అచ్చెన్నాయుడు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం గా మారిపోయింది. గతంలో అచ్చం నాయుడు టిడిపి ప్రభుత్వ హయాంలో కార్మిక మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఈఎస్ఐ స్కాం లో అచ్చం నాయుడు హస్తం ఉందని తేలడంతో అధికార వైసీపీ నేతలు అందరూ తీవ్ర స్థాయిలో అచ్చం నాయుడు పై విమర్శలు కురిపిస్తున్నారు.ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాం విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 


 ఈఎస్ఐ స్కాం లో 150 కోట్ల అవినీతి జరిగింది అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా పని చేశారు అని గుర్తు చేసిన ఎమ్మెల్సి జంగా కృష్ణమూర్తి.... కార్మికశాఖ మంత్రిగా ఉండి అచ్చెన్నాయుడు అవినితికి  కొమ్ము కాశారు అంటు  ఆరోపించారు. 150 కోట్లకు పైగా జరిగిన ఈఎస్ఐ స్కాం లో మాజీమంత్రి టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు పాత్ర ఉందని విజిలెన్స్ అధికారుల విచారణలో రుజువైంది అంటూ విమర్శలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. 

 


 అచ్చం నాయుడు అరెస్టు కి... బీసీలకు సంబంధం ఏమిటి అంటూ  ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బీసీలకు మునుపెన్నడూ లేని విధంగా ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ తెలిపారు కృష్ణమూర్తి. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే  చూశారు తప్ప బీసీల అభివృద్ధికి చేసిందేమీ లేదు అంటూ వ్యాఖ్యానించారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని... కానీ తప్పుచేసిన అచ్చెన్నాయుడు అరెస్ట్ చేస్తే మాత్రం చంద్రబాబు డ్రామా చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఈఎస్ఐ  స్కామ్ లో తప్పుచేసిన అచ్చెన్నాయుడు బీసీలను వాడుకోవడం దారుణం అంటూ ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని  స్కామ్ లు  ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అని  ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: