ఈ మధ్యకాలంలో యాచకుల సంపద చూసి షాక్ అవ్వాల్సిందే రోజులు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది యాచకులు యాచక వృత్తిలో కొనసాగుతూనే లక్షలు లక్షలు సంపాదించిన వారు చాలా మంది ఉన్నారు. ఇలా చాలామంది యాచక వృత్తిలో కొనసాగుతూ లక్షలకు లక్షలు కూడా పెట్టుకుంటున్నారు. అయినప్పటికీ ఏమీలేని వారిలాగానే జీవితం కొనసాగిస్తు యాచకుల గానే జీవితం గడుపుతున్నారు. కానీ వారు చనిపోయిన తర్వాత వారి సంపాదన చూసి అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా విజయవాడలో ఇలాంటి ఘటన జరిగింది.ఆలయాల ముందు బిచ్చమెత్తుకుని ఒక యాచకుడు  సుమారు ఎనిమిది లక్షలకు పైగా దేవాలయానికి  విరాళం  అందించడం సంచలనంగా మారిపోయింది. 

 


 గుడికి వచ్చే భక్తులు దయ చూపి ఆ యాచకుడుకి  ఇచ్చిన డబ్బులను ఆలయాలకే విరాళంగా ఇచ్చేశాడు యాదిరెడ్డి. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా చింతపల్లి కి చెందిన యాదిరెడ్డి అనే వ్యక్తి పదేళ్ల వయసులోనే విజయవాడకు వచ్చాడు. ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్నాడు. ఇక తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో బతుకుదెరువు కోసం రిక్షా తొక్కి  జీవనం సాగించేవాడు. ఆ తర్వాత రైల్వే ప్లాట్ ఫాం లో నిద్రపోయాడు. ఆరోగ్యం సహకరించక పోవడంతో రిక్ష తొక్కడం  కూడా మానేసి  ఆలయాల వద్ద భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. తొలుత విజయవాడలోని ముత్యాలపాడు కోదండ రామాలయం వద్ద భిక్షాటన చేసిన తర్వాత శిరిడి సాయిబాబా ఆలయం వద్ద కూడా బిక్షాటన  చేయడం మొదలు పెట్టాడు. 

 


 ఈ క్రమంలోనే సదరు యాచకుడు వసతి భోజనం ఆలయ నిర్వాహకులు చూసుకునేవారు. దీంతో తన బిక్షాటన  చేయగా వచ్చిన డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం యాదిరెడ్డి ఆరోగ్యం క్షీణించి   చావు బతుకుల మధ్య ఉన్న సమయంలో తాను బతికితే లక్ష రూపాయలు విరాళంగా సాయిబాబా ఆలయానికి  ఇస్తానని అనుకున్నాడట. ఇక అనారోగ్యం బారినుంచి కోలుకున్నారు. దీంతో మాట ఇచ్చిన ప్రకారం  లక్ష రూపాయల విరాళం ఈ ఆలయానికి అందజేశారు యాదిరెడ్డి. అంతేకాకుండా ఒక రూపాయి చొప్పున కొబ్బరికాయకు 1.08 లక్షలు చెల్లించారు. గోశాల నిర్మాణానికి 3 లక్షలు.. రామలక్ష్మణులకు వెండి కెరటాలు... అన్నదానానికి 1.1 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఇప్పటి వరకు సుమారు ఏకంగా ఎనిమిది లక్షలకు పైగా దేవాలయానికి విరాళంగా ఇచ్చాడు యాదిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: