ఈ మద్య చాలా మంది వీడియో గేమ్స్ తోనే టైమ్ పాస్ చేశారు.  కరోనా వైరస్ వ్యాపిస్తుందని మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఇంటి పట్టున ఉంటూ కరోనా పై యుద్దం చేశారు. అయితే కరోనాతో యుద్దం చేసే విషయం పక్కన బెడితో చిన్నా పెద్ద కంప్యూటర్లు, ల్యాప్ టాప్, సెల్ ఫోన్లతోనే పూర్తి సమయాన్ని గడిపారు.  పబ్జీ గేమ్ టీనేజ్ కుర్రాళ్లను మాత్రమే కాదు పెళ్ళైన మగవాళ్ళకు కూడా వ్యసనంగా మారుతోంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో జరిగిన ఓ ఆత్మహత్యే ఇందుకు నిదర్శనం. సిమ్లాలోని మోహ్లీకి చెందిన జస్ప్రీత్ కౌర్(33) అనే మహిళ తన భర్త రాత్రంతా పబ్‌జీతోనే గడుపుతున్నాడని.. ఎప్పుడు తన సెల్ ఫోనే జీవితం అనేలా చివరికి తన కూతురుని కూడా పట్టించుకోకుండా తయారయ్యాడన్న ఆవేదన ఆమె మనసు కలచి వేసింది.

 

లాక్‌డౌన్ మొదలైనప్పటీ నుంచి ఆమె భర్త పబ్‌జీ గేమ్ ఎక్కువగా ఆడుతున్నాడు. రాత్రివేళలో కూడా భార్యను పట్టించుకోకుండా పబ్‌జీ గేమ్ ఆడుతున్నాడు. దీంతో ఆమెకు విరక్తి చెందింది.  గతంలో కన్నా లాక్‌డౌన్ మొదలైనప్పటీ నుంచి ఆమె భర్త పబ్‌జీ గేమ్ ఎక్కువగా ఆడుతున్నాడు. రాత్రివేళలో కూడా భార్యను పట్టించుకోకుండా పబ్‌జీ గేమ్ ఆడుతున్నాడు. అతనికి ఎంత చెప్పినా తన వాళ్లతో చెప్పించినా ఆయన మాత్రం పబ్జీ గేమ్ మైకంలోనే మునిగిపోయారట.

 

ఈ మేరకు మే 31న కౌర్ తన బాధను న్యూ మామ్స్ క్లబ్ అనే ఫేస్ బుక్‌ గ్రూపులో పోస్టు చేసింది. తరువాత జూన్ 2న ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్తను పోలీసులు అరెస్టు చేశారు.  తాజాగా జస్ప్రీత్ కౌర్ సోదరుడు జాస్మిత్ సింగ్ స్పందిస్తూ…కౌర్ భర్త చిన్న విషయాలకు గొడవకు దిగి వంటగదిలోని సామాగ్రినంతా బయటకు విసిరేసేవాడు.  పబ్జీ గేమ్ గేమ్ కి అడెక్ట్ కావొద్దని చెప్పితే తమను తిట్టేవాడని అన్నారు.   గత కొద్ది రోజులుగా అతడు రోజూకీ సగటున 10 గంటల పాటు పబ్‌జీ ఆడేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: