దేశంలో కరోనా కేసుల కంటే...కోలుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఈ మందులేని మహమ్మారికి ప్లాస్మా థెరఫీ ఊరటనిస్తోంది. కరోనా సోకి, ఊపిరి పోయే పరిస్థితిలో ఉన్న వాళ్లకు ప్లాస్మా థెరఫీ ఆశా కిరణంగా మారింది. ప్రాణాపాయం లో ఓ వ్యక్తి ప్లాస్మా ట్రీట్ మెంట్ తో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు..

 

మందులేని రోగాన్ని నయం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా, కొత్త మార్గాలు వెదుకుతున్నారు. ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అతని దేహంలో తయారయ్యే యాంటీబాడీస్‌.. అతను కోలుకున్న తర్వాత కూడా నెలల తరబడి ప్లాస్మాలో ఉంటాయని వాటిని ఉపయోగించుకొని ఇతరులకు వైద్యం చేసే వీలుంటుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. ప్లాస్మా ప్రాణాపాయం లో ఉన్న వాళ్లకు వ్యాక్సిన్‌లాగే పనిచేస్తుంది అని తేల్చారు.. దాంతో కరోనా సోకి సీరియస్ గా ఉన్న వాళ్ళకు ప్లాస్మా ద్వారా చికిత్స చేస్తున్నారు.. ప్రస్తుతం ప్లాస్మా థెరఫీ పై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నా సత్పలితాలను ఇస్తోంది.

 

గాంధీ ఆస్పత్రిలో కరోనా తో చేరిన వంశీ కృష్ణ అనే పేషేంట్ కు తొలి సారి ప్లాస్మా థెరఫీ చేశారు.. ప్రస్తుతం వంశీ కరోనా నుంచి కోలుకుని సాధారణ జీవితం అనుభవిస్తున్నారు. వంశీ ముందు ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో ఫ్లూ లక్షణాలతో చేరారు.. ఆ తర్వాత కరోనా నిర్ధారణ చేయగానే గాంధీకి తరలించారు. అయితే గాంధీలో చేరడానికి ముందే లంగ్స్ ఇన్ఫెక్షన్ పెరిగింది. ప్రాణాలకు ప్రమాదం అని డిక్లర్ చేశారు.. 

 

గాంధీల్లో చేరగానే వంశీ ఆరోగ్య పరిస్థితి ప్లాస్మా థెరఫీ తప్ప మరే మార్గం లేదని నిర్ణయించి, ఫైనల్ గా వంశీ కృష్ణకు అప్పటికే సేకరించిన ప్లాస్మా ను ఇచ్చారు... నాలుగు రోజుల్లో వంశీ రికవరీ అయ్యారు. మొత్తానికి డేంజర్ లో ఉన్న కరోనా పేషేంట్లకు ప్లాస్మా థెరఫీ ప్రాణం పోయనుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: