- మ‌ళ్లీ ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు
- యువ ఎంపీ రామూ ఫైర్
- ప్రెస్ మీట్లో కీల‌క వ్యాఖ్య‌లు

 

బాబాయ్ అచ్చెన్న అరెస్టుపై యువ ఎంపీ కింజరాపు రామ్మోహ‌న్ నాయుడు స్పందించారు. ఈ సంద‌ర్భంగా  జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్టీఆర్ భ‌వ‌న్లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశం నిర్వహించారు. ఆయ‌నేమ‌న్నారంటే.. ఎవ‌ర‌యినా ప్ర‌శ్నిస్తే అక్ర‌మంగా కేసులు బ‌నాయిస్తున్నారు. వారిపై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో మాట్లాడితే వేధింపులకు గురిచేస్తున్నారు. అంతేకానీ ఈ ఏడాది కాలంలో రాష్ట్రానికి ఒర‌గ‌బెట్టింది ఒక్క‌టీ లేదు. అసెంబ్లీ స‌మావేశాల దృష్ట్యానే బాబాయ్ ను క‌ట్ట‌డి చేసే వ్యూహం ఒక‌టి అమ‌లు చేస్తున్నారు. అక్ర‌మ కేసుల సృష్టితో సాధించేదీ ఉండ‌దు. ఈఎస్ఐల‌కు సంబం ధించి కేం‌ద్రం ఇచ్చిన నిధులు ఇవి దుర్వినియోగం అయ్యాయ‌ని చెప్ప‌డం త‌గ‌దు. మందుల కొనుగోళ్ల‌లో అక్ర‌మాలు ఉంటే కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలో ఒక‌టికి రెండు సార్లు చెక్ చేస్తారు. 

 

పొరుగున ఉన్న తెలంగాణ‌లోనూ ఇలాంటి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తితే వాటిపై ద‌ర్యాప్తు అనంత‌రం సెక్ష‌న్ ఆఫీస‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు. అలానే ఇక్క‌డ కూడా జ‌రిగితే స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మొట్ట‌మొద‌ట్లోనే బాబాయ్ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ! చెప్పారు. ఆ రోజు రికార్డులు అన్నీ మీ ద‌గ్గ‌రే ఉన్నాయి క‌నుక మీరే వీటిపై స‌మ‌గ్ర అధ్య‌యనం చేయించి, బాధ్యుల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టండి అని రాష్ట్ర ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి చెప్పారు. అ దేవిధంగా తాను త‌ప్పు చేసినా ఏ విచార‌ణ‌కు అయినా సిద్ధం అని కూడా చెప్పారు. కానీ ఇవేవీ ప‌ట్టించుకోక ఒక బీసీనేత‌ను అ రెస్టు చేసిన తీరు ప్ర‌జాస్వామ్య రీతిలో లేదు.ఇవాళ ప్ర‌తి ఒక్క‌రూ అరెస్టుల‌ను ఖండిస్తున్నారు.. ఈ చ‌ర్యకు ప‌దింత‌లు అనుభ విం చేలా రాష్ట్ర ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని జ‌గ‌న్ చ‌‌విచూస్తారు.

 

ఎర్ర‌న్న  కుటుంబం నీతికి నిబ‌ద్ధ‌త‌కు క‌ట్టుబ‌డి ఉండే కుటుంబం.ఆయ‌న పేరు ని ల‌బెట్టేందుకు నిజాయితీగా ప‌నిచేస్తున్నాం..ఆయ‌న‌కు చెడ్డ పేరు రాకూడ‌ద‌న్న త‌లంపుతో ప‌నిచేస్తున్నాం. అచ్చెన్న ఏ త‌ప్పూ చేయ‌లేద‌న్న నిజానిజాలు ఏంట‌న్నవి త్వ‌ర‌లోనే వెల్ల‌డ‌వుతాయి.జ‌గ‌న్ బీసీల‌కు క్ష‌మాప‌ణ‌లు  చెప్పాలి. క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టింది చంద్ర‌బాబు.. కానీ ఏడాదిలో వైసీపీ సాధించిందేమీ లేదు. ప్ర‌జావేదిక ను కూల్చేశారు..చంద్ర‌న్న భ‌రోసా ర‌ద్దు చేశా రు ..అన్న క్యాంటీన్ల‌ను తీసేశారు..అన్నింటిలోనూ మాఫియా.. ఇసుక త‌రంలిపులోనూ, మ‌ద్యం కొనుగోళ్ల‌లోనూ త‌దితర వాటిలో నూ మాఫియా..ప‌థ‌కాల అమ‌లులోనూ మాఫియా..య‌థేచ్ఛ‌గా న‌డుస్తోంది. ప్ర‌తిప‌క్షాన్ని వ్య‌వ‌స్థ ఇచ్చే గౌర‌వాన్ని కాద‌ని రాజ్యాం గాన్ని అప‌హాస్యం చేస్తున్నారు. వ్య‌క్తిగ‌త వేధింపుల‌కూ వెనుకాడ‌డం లేదు. విశాఖ ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీలో సంభ‌వించిన ప్ర‌మా దం విష‌యంలోనూ రాజ‌కీయాలు చేశారు. ఇదే కాదు ఏ విష‌య‌మై కూడా అవ‌గాహ‌న లేదు..స్ప‌ష్ట‌త లేదు..విజ‌న్ లేదు..అని వ్యాఖ్యానించారు యువ ఎంపీ.

మరింత సమాచారం తెలుసుకోండి: