ఇటీవల కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ తర్వాత తిరుమల తిరుపతి ఆలయం దాదాపు 70 రోజులకు పైగానే మూసివేయడం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కేంద్రం దేశంలో అని  ఆలయాలు ఓపెన్ చేసుకోవచ్చని అనుమతులు ఇవ్వటంతో టీటీడీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని తిరుమల తిరుపతి ఆలయానికి భక్తులు దర్శించుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆన్ లైన్ ద్వారా టికెట్ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి భక్తులకు అనుమతులు ఇవ్వటంతో రోజుకి ఆరు వేలకు పైగానే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు, తప్పనిసరిగా మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటూ సోషల్ డిస్టెన్స్ భక్తుల పాటించేలా ఎక్కడికక్కడ భద్రతా పరంగా అన్ని రకాల చర్యలు టీటీడీ అధికారులు చేపట్టడం జరిగింది.

 

ఇదిలా ఉండగా గోవిందరాజు స్వామి వారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ టీటీడీ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో… ఆలయాన్ని క్లోజ్ చేసేసారు. రెండు రోజుల పాటు మళ్లీ ఆలయం తెరిచే ప్రసక్తి లేదని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గోవిందరాజు ఆలయంలో ప్రతీచోటా శానిటేజైషన్ చేస్తూ కరోనా వైరస్ ఎఫెక్ట్ లేకుండా చూసుకుంటున్నారు. ఇదే సమయంలో ఆ ఉద్యోగితో కలిసిన సహచర ఉద్యోగులను వ్యక్తులను కూడా క్వారంటైన్ కి తీసుకెళ్లారు. వచ్చే ఆదివారం ఆలయం మళ్లీ ఓపెన్ చేయనున్నట్లు టీటీడీ సిబ్బంది తెలిపింది.

 

ఈ సంఘటనతో ఒక్కసారిగా స్వామి వారి భక్తులు ఇలా అయితే స్వామి వారిని దర్శించుకోవడం రాబోయే రోజుల్లో కష్టమవుతోందని భావిస్తున్నారు. మరి కొంతమంది త్వరగా మెడిసిన్ రావాలని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఇటీవలే ఆలయాలు ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఘటన జరగటంతో ఆలయం క్లోజ్ అవటంతో భక్తులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: