దేశంలో కరోనాతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభణ వేగం మరింతగా పెరిగింది. ఈ క్రమంలో మొత్తం కరోనా కేసుల విషయంలో ఇండియా, బ్రిటన్ ను దాటేసింది. అత్యధిక కేసులున్న దేశాల్లో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్పటివరకూ ఇండియాలో మరణాల సంఖ్య 8,500గా అధికారులు వెల్లడించారు. మొత్తం మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ 3,482 మంది మరణించారు. మొత్తం కేసుల్లో మూడింట ఒక వంతు... అంటే దాదాపు లక్ష కేసులు జూన్ లోనే నమోదు కావడం గమనార్హం.

 

 

ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 2,95,772కు చేరింది. ప్రస్తుతం బ్రిటన్ లో ఇండియాకన్నా తక్కువగా 2,91,588 కేసులు ఉన్నాయి. మే 24 నుంచి భారతావనిలో కరోనా మహమ్మారి విజృంభణ శరవేగమైంది. ఇండియా టాప్-10 బాధిత దేశాల్లోకి చేరింది. అయితే  కరోనా కేసలు రోజు రోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.   మహారాష్ట్రలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో కరోనా ఆస్పత్రి ప్రారంభమైంది. నేషనల్ హెల్త్ మిషన్, పూణె జిల్లా పరిషత్, జిల్లా ఆరోగ్య సొసైటీ, విప్రో లిమిటెడ్ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశాయి. 

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రి కోసం విప్రో సంస్థ.. 504 బెడ్లు, 18 వెంటిలేటర్లు, రెండు ఆంబులెన్స్‌లను సమకూర్చింది. ఇదిలావుండగా రాష్ట్రంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతున్న క్రమంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారన్న వార్తలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి.  దేశంలోనే తొలిసారి ఏర్పాటైన ఈ ఆసుపత్రిని విప్రో హింజేవాడీ కార్యాలయం పరిసరాల్లో ఏర్పాటు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: