తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడారంగంలో ముందుంచేందుకు  ప్ర‌భుత్వం ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ పాల‌సీని తీసుకురావాల‌ని యోచి స్తోంది. ఈ మేర‌కు విధివిధానాల‌ను త‌యారు చేసేందుకు నిర్ణ‌యించింది.ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి తో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులను తీర్చిదిద్దేoదుకు క్రీడా పాలసీ ని G O  R T నెంబర్ 911 ద్వారా ఏర్పాటైన కేబినేట్ సబ్ కమిటీ తొలి సమావేశo జరిగింది. ఈస‌మావేశంలో మంత్రులు శ్రీ కేటీఆర్ , సబిత ఇంద్రారెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకరరావు,  శ్రీనివాస్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత క్రీడా రంగ పరిస్థితులను మంత్రులు క్రీడా శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న క్రీడా మౌళిక సదుపాయాలు, అకాడమీ లు, స్పోర్ట్స్ స్కూల్స్, స్టేడియం ల పరిస్థితి,  కోచ్ ల వివరాలు, క్రీడాకారుల వివరాలపై మంత్రులు పూర్తి వివరాలను సేకరించడం జరిగింది. 

 

ఈ సందర్భంగా మంత్రులు క్రీడా శాఖ అధికారులకు స్పోర్ట్స్ పాలసీ రూపకల్పన పై  దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం గత 6 సంవత్సరాలలో  ఐటీ, పారిశ్రామిక, వ్యవసాయ, పంచాయతీ రాజ్, విద్య, వైద్య, ఇరిగేషన్ రంగాలతో పాటు, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రగామిగా, మోడల్ రాష్ట్రం గా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అదేవిధంగా రాష్ట్రo క్రీడా రంగంలో కూడా దేశంలోనే  నెంబర్ వన్ రాష్ట్రం గా తీర్చిదిద్దేoదుకు క్రీడా పాలసీ ని ప్రవేశపెట్టారన్నారు. అందులో భాగంగా క్రీడా పాలసీ ని రూపొందించటానికి ప్రపంచంలో ఏ దేశంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందించబడిందో క్రీడా శాఖ అధికారులు అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు పర్చాలని క్యాబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. 

 

 ఈ కమిటీ లో క్రీడా శాఖ మరియు ఇతర ప్రభుత్వ శాఖలైన విద్యా, పురపాలక మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ల ప్రభుత్వ  కార్యదర్శులందరితో త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంను క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి క్రీడా మౌళిక సౌకర్యాలు, క్రీడాకారులకు అందిస్తున్న సౌకర్యాలపై సమగ్ర వివరాలను కేబినెట్ సబ్ కమిటీ కి అందించాలని మంత్రులు ఆదేశించారు. వచ్చే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ప్రముఖ క్రీడాకారులను, కోచ్ లను ఆహ్వానించి వారి అభిప్రాయాలను , సలహాలను స్వీకరించాలని మంత్రులు క్రీడా శాఖ అధికారులను  ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: