ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొద్దీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఒకపక్క కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చాలా వేగవంతంగా చేయడంతో మరోపక్క భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడటంతో ప్రజలలో భయాందోళనలు నెలకొంది. లాక్ డౌన్ ఆంక్షలు మరియు సడలింపులు ఎత్తివేసిన ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావటానికి బిక్కుబిక్కుమంటున్నారు. ఇటువంటి సమయంలో కేంద్రం ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా కరోనా వైరస్ టెస్టులు చేసేందుకు అనుమతులు ఇవ్వడం జరిగింది.

IHG

అయితే అనుమతులు వచ్చినాయి కదా అని ఇష్టానుసారంగా సామాన్య ప్రజల దగ్గర డబ్బులు టెస్టుల పేరుతో వసూలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు అన్నట్టుగా ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ ప్రతి ప్రైవేట్ ల్యాబ్ కరోనా వైరస్ వైద్యపరీక్షలు కి ఒక టెస్ట్ కి 2900 రూపాయలు మాత్రమే తీసుకోవాలి అంటూ రేట్ ఫిక్స్ చేశారు. అంతకుమించి ఒక్క రూపాయి తీసుకున్న ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లే అని.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

IHG's hospitals running out of vital medicines for COVID-19 ...

అంతేకాకుండా టెస్టులు నిర్వహించే ల్యాబ్ లకు ఐసీఎంఆర్, ఎన్ఏబిఎల్ గుర్తింపు కలిగి ఉండాలని షరతు విధించింది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుండి మరియు దేశాల నుండి రాష్ట్రం లోకి వస్తున్న వారి వల్ల కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో మరింతగా టెస్టుల సంఖ్య పెంచాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయింది. కాగా దేశంలో ఐదు లక్షల టెస్టులు చేసి మొదటి స్థానంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: