విశాఖను రాజధానిగా ఇప్పటికే నిర్ణయించిన ఏపీ సర్కారు.. దాని అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తోంది. వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే విశాఖపట్నం సమీపంలో భోగాపురం వద్ద నిర్మించ తలపెట్టిన కొత్త విమానాశ్రయం విషయంలో పనులు జోరుగా సాగేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఏపీ సర్కారు జి.ఎమ్. ఆర్. సంస్థతో ఒప్పంద చేసుకుంది.

 

 

ఈ ఒప్పందం ప్రకాశం జి.ఎమ్.ఆర్. సంస్థ భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో జిఎమ్.ఆర్ .ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు. ఇప్పటికే ఈ విమానాశ్రయం కోసం 2700 ఎకరాల భూమిని సేకరించారు. అందులో 500 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం తన వాణిజ్యపరంగా వాడుకునేందుకు వెనక్కి తీసుకుంది.

 

 

జీఎంఆర్ సంస్థతో కుదిరిన ఈ ఒప్పందం ఏపీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. జీఎమ్మార్ సంస్థకు ఎయిర్ పోర్టుల నిర్మాణంలో అదిరిపోయే ట్రాక్ రికార్డు ఉంది. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయాన్ని ఈ జీఎంఆర్ సంస్థే నిర్మించింది. శంషాబాద్ విమానాశ్రయం రూపుదిద్దుకున్నాక హైదరాబాద్‌ అభివృద్ధి మరింత వేగవంతమైంది.

 

 

ఇక ఈ జీఎమ్మార్ సంస్థ.. ఢిల్లీ, ముంబయి ఎయిర్ పోర్టులనే కాకుండా అంతర్జాతీయంగానూ అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టి తగిన సమయంలోనే పూర్తి చేసింది. అందులోనూ ఈ సంస్థ యజమాని గ్రంథి మల్లికార్జునరావు.. ఉత్తరాంధ్రకు చెందినవారే.. ప్రపంచంలో ఎన్నో ప్రాజక్టులు అద్భుతంగా నిర్మించిన ఆయన తన సొంత ప్రాంతానికి చెందిన ప్రాజెక్టు విషయంలో ఎంత ప్రతిష్ఠాత్మకంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: