తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరుపొందిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారంలో కొద్ది రోజులుగా దూకుడుగా ఉంటున్నారు. తనను ఆ కారణంగా జైలుపాలు చేశారనే బాధతో ఆయన గతం కంటే ఇప్పుడు మరింత స్పీడ్ పెంచినట్టు కనిపిస్తునాన్రు. కేసీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు తీసుకువెళ్ళగలిగారు. ఈ వ్యవహారంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించి కేటీఆర్ కు నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆ నోటీసుపై తాత్కాలికంగా కేటీఆర్ కు హైకోర్టులో స్టే లభించింది. ఇక విషయానికి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద డ్రోన్ కెమెరా ఎగరవేశారు అనే కారణంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి పది రోజుల పాటు జైలులో పెట్టిన సంగతి తెలిసిందే. 

IHG's farm ...

 

 తనను పోలీసులు అకారణంగా అరెస్టు చేశారని, సుప్రీం కోర్ట్ నిబంధనలు ఉల్లంఘించారని రేవంత్ ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేశారు. తనపై ఏదైనా ఫిర్యాదు వస్తే 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని, కానీ ఆ విధంగా చేయకుండా, తనను అరెస్టు చేశారని, ఈ విధంగా చేయడం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ ను రేవంత్ రెడ్డి దాఖలు చేశారు. అలాగే తనను అరెస్ట్ చేసిన మాదాపూర్ ఏసిపి శ్యామ్ ప్రసాదరావు, నర్సింగ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ పై ఆయన ఫిర్యాదు చేశారు. వీరు తనకు 41 ఏ కింద నోటీసులు ఇవ్వకుండా, కోర్టు ధిక్కరణకు పోలీసు అధికారులు పాల్పడ్డారంటూ రేవంత్ పిటిషన్ లో వివరించారు.


 కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి మీడియాను వెంటబెట్టుకుని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కు వెళ్లగా, పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కానీ ఫామ్ హౌస్ వద్ద డ్రోన్ కెమెరా కి సంబంధించిన దృశ్యాలను మాత్రమే మీడియాకు విడుదల చేశారు. ఇక ఆ సందర్భంగా రేవంత్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత విడిచిపెట్టారు. ఇక పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లి తిరిగి వస్తున్న రేవంత్ ను శంషాబాద్ విమానాశ్రయం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. వివిధ కారణాలతో దాదాపు పది రోజులపాటు రేవంత్ రెడ్డి జైలులోనే గడపాల్సి వచ్చింది.ఇక ఇప్పుడు పోలీసులపైనే రేవంత్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: