టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్నారు. అనుకోకుండా ఆయ‌న క‌రోనా వివాదంలో చిక్కుకున్నారు. ఓ మీడియా ఛాన‌ల్‌తో మాట్లాడుతూ, లాక్ డౌన్ కొన‌సాగింపు విషయంలో తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా చ‌ర్చిస్తోంద‌ని, మ‌రో రెండు రోజుల్లో ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని పేర్కొన్న‌ట్లు పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. దీనిపై త‌ల‌సాని స్పందించారు. త‌న పేరుతో వచ్చిన వార్తను ఖండిస్తున్నాన‌ని మంత్రి తలసాని వెల్ల‌డించారు. 


తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ లాక్ డౌన్‌ సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. కరోనా నియంత్రణ కోసం తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసిస్తుండగా, స్థానిక బీజేపీ నేతలు తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కొన్ని సమయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కరోనా కట్టడి కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తెరగాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి త‌ల‌సాని చెప్పారు.

 

బీజేపీ నేత‌ల‌కు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే సడలింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వంను ప్రశ్నించాలని మంత్రి త‌ల‌సాని సవాల్ చేశారు. ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా బీజేపీ నేతలు పబ్లిసిటీ కోసమే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. లాక్ డౌన్ విషయమై ఒక చానల్ లో తన పేరుతో వచ్చిన ప్రకటనను మంత్రి ఖండించారు
లాక్ డౌన్ విషయంలో వదంతులు నమ్మవద్దని కోరిన ఆయ‌న ఈ విషయంలో త‌న పేరుతో వచ్చిన వార్తను ఖండిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: