దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా విలయతాండవం చేస్తుంది. గడిచిన 24గంటల్లో 2137పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా వల్ల 71 మంది మరణించారని ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఈకొత్త కేసులతో కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు  36824కరోనా కేసులు నమోదు కాగా 13398 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 22212 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. కాగా కరోనా తో ఇప్పటివరకు 1214 మంది మరణించారు. 
 
 
ఇక మిగితా రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీగా కేసులు నమోదు కావడం తో ఈఒక్క రోజే  దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య  11000 దాటింది. అందులో అత్యధికంగా మహారాష్ట్ర లో 3493  కేసులు నమోదుకాగా తమిళనాడు లో 1982 , గుజరాత్ లో 480, ఉత్తర ప్రదేశ్ 528, పశ్చిమ బెంగాల్ లో 476 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 309300కుపైగా కేసులు నమోదు కాగా 8890మరణాలు చోటుచేసుకున్నాయి.
 
ఇదిలావుంటే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో ప్రధాని మోదీ ఈనెల 16, 17వ తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో కరోనా ప్రారంభమైన ప్పటినుండి మోడీ ఇప్పటికే  పలు మార్లు  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు మరోసారి సమావేశం కానుండడం తో  అందరి లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే కరోనా తీవ్ర రూపం దాల్చడం తో  మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను విధించే అవకాశాలు కూడా లేకపోలేదని వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: