తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా ఉదృతంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యహరిస్తోంది అని న్యాయస్థానాలు సీరియస్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇటువంటి తరుణంలో తాజాగా కరోనా వైరస్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కి సోకింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కి కరోనా వైరస్ పాజిటివ్ తేలినట్టు నిర్ధారణ అయింది. జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముత్తిరెడ్డి కి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో హైదరాబాద్ నగరంలో క్వారంటైన్ లో ఉన్నారు. ఆయనకి టెస్ట్ చేయగా… పాజిటివ్ అని నిర్ధారణ రావడంతో తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ బారిన పడిన మొదటి ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి వార్తల్లో నిలిచారు.

IHG

ఇక శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్త కేసులు సంఖ్య 164 నమోదు అవ్వగా తొమ్మిది మంది చనిపోయారు. మొత్తం మీద రాష్ట్రంలో 4035 కరోనా వైరస్ కేసులు నమోదవగా 179 మంది చనిపోయినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. యాక్టివ్ కేసులు 2023 ఉండగా డిశ్చార్జ్ అయిన కేసులు 2012 గా లెక్క తేలింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాలా ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతున్నట్లు అధికారిక లెక్కల బట్టి అర్థం అవుతోంది. పేద మరియు ధనిక ప్రైమ్ మినిస్టర్ మరియు మంత్రులను ఎమ్మెల్యేలను ఎవ్వరిని కనికరించడం లేదు కరోనా వైరస్.

IHG

తన పని తాను చేసుకుపోతోంది. ఇటువంటి తరుణంలో త్వరలో ఎంత తొందరగా వ్యాక్సిన్ వస్తే అంత మంచి జరుగుతుందని అందరూ ఆశగా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇండియాలో ఉన్న కొద్ది వైరస్ ప్రభావం భయంకరంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కేంద్రంలో కూడా టెన్షన్ మొదలైంది. ఈ తరుణంలో ఈ నెల 16, 17 తారీకు న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ భేటీ కాబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: