తెలంగాణలో ఎమ్మెల్యే కూడా కరోనా బారినపడ్డారు. అధికార పార్టీకి చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కరోనా అనుమానంతో నిన్న పరీక్షలు చేయించుకోగా యాదగిరి రెడ్డికి పాజిటివ్ గా తేలింది. ఇక పేరుకే జనగామ ఎమ్మెల్యే కానీ..యాదగిరి రెడ్డి ఎక్కువగా హైదరాబాద్ లోనే వుంటారు. ఈనెల 2వతేదీన  చివరిసారి ఆయన జనగామ కు వచ్చారు. 
 
ఇదిలావుంటే తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. నిన్నరాష్ట్ర వ్యాప్తంగా 164 పాజిటివ్ కేసులు నమోదుకాగా 9మంది మరణించారని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదలచేసింది. అయితే ఈహెల్త్ బులెటిన్ లో ఎమ్మెల్యే కేసు నమోదు కాలేదు. నిన్న సాయంత్రం 5గంటల వరకు నమోదయిన కేసులతో మాత్రమే హెల్త్ బులిటెన్ విడుదలకాగా ఎమ్మెల్యే కు పాజిటివ్ వచ్చినట్లు రాత్రి బయటపడింది. 
ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 4484 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 2278మంది బాధితులు కోలుకున్నారు ప్రస్తుతం 2032 కేసులు యాక్టీవ్ గా ఉండగా కరోనా మరణాల సంఖ్య 174కు చేరింది. మరోవైపు కేవలం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 39553 కరోనా టెస్టులు మాత్రమే చేయడం పై ప్రజలనుండి  తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కాగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు 500000 పై చిలుకు టెస్టులు చేయడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: