వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఏడాది అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగుదేశం పార్టీ తమ ప్రభుత్వంలో చేసిన అవినీతి మరియు అక్రమాలు బయటకు తీస్తామని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఐతే గత ఏడాది కాలంలో అలాంటి సంకేతాలు పెద్దగా కనిపంచకపోవడంతో తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి విషయంలో జగన్ సర్కారు లైట్ తీసుకున్నట్లే కనిపించింది

 

అయితే ముందు తను పాలనాపరంగా సెటిల్ అయ్యేందుకు ఏడాది సమయం తీసుకున్న జగన్ ఇప్పుడు ఒక్కసారిగా అచ్చెన్నాయుడు అరెస్టుతో కొరడా ఝలిపించినట్లు అయ్యింది. ఇప్పటికే నిన్నటి కేబినెట్ మీటింగ్ లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పై సిబిఐ విచారణకు ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి ఇప్పుడు తన నెక్స్ట్ టార్గెట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

 

ఈఎస్ఐ మందుల కొనుగోలు స్కామ్ లో అచ్చెన్నాయుడు ఇరుక్కున్నాడు. అందులోనే ఇప్పటికే కొందరు ఉద్యోగులను అరెస్టు చేశారు. ఇక ఇప్పుడు జగన్ మరికొందరు తెదేపా నేతల ప్రమేయం కూడా స్కామ్ లో ఉన్నట్లు భావిస్తుండగా మరో మాజీ మంత్రిని కూడా సిబిఐ అరెస్టు చేసే అవకాశం ఉందంట.

 

అతనే ప్రత్తిపాటి పుల్లారావు. ప్రత్తిపాతి పుల్లారావు తనయుడికి స్కామ్ లో వాటా ఉందని మరియు అతని తండ్రి అండ తోనే అతను అక్రమాలకు పాల్పడినట్లు చెబుతున్నారు. స్కాంలో ఇప్పటికే అతను అడ్డంగా దొరికారని అంటున్నారు. కొన్ని నకిలీ కంపెనీలకు టెండర్ కూడా లేకుండా మందుల కాంట్రాక్టు ఇచ్చే దిశగా అచెన్నాతుడు ఈఎస్ఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖ తాలూకు అన్నీ సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అధికారులు అచ్చెన్నను అరెస్టు చేయగా…. త్వరలో ప్రత్తిపాటి మరియు అతని కుమారుడిని కూడా కస్టడీ లోకి తీసుకునే అవకాశం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: