ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరియు తెలంగాణ సీఎం కేసీఆర్ మంచి మిత్రులు అన్న విషయం తెలిసిందే. మధ్య ఏదో జలవివాదం చెలరేగగాచివరికి అంతా సద్దుమణిగింది. అయితే ప్రస్తుతం సీఎం గా జగన్ పరిస్థితి ఒక్క హైకోర్టు ఇచ్చిన ప్రతికూల నిర్ణయాలను మినహాయించి అంతా బాగానే ఉంది. కానీ కెసిఆర్ మాత్రం విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాడు. ఎన్నడూలేని విధంగా తెలంగాణలో ప్రతిపక్షాల నుండి కేసీఆర్ కు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ప్రజల్లోనే వ్యతిరేక భావం మొదలైంది. దానికి ముఖ్యకారణం కరోనా విషయంలో అతని వైఫల్యం.

 

వివరాల్లోకి వెళితే గత వారం రోజులుగా తెలంగాణలో కరోనా పేషంట్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ఎంతో మంది సరైన వైద్య సదుపాయాలు లేక చనిపోతున్నట్లు ఎన్నో ఆరోపణలు వరుసబెట్టి వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాదులో అయితే రోజు కొత్తగా ఆసుపత్రికి వస్తున్న వందలాది రోగులను ట్రీట్ చేయలేక, రిస్క్ ఎక్కువ ఉన వారికి ప్రత్యేక పర్యవేక్షణ లో ఉంచలేక డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తగ్గట్టు గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరసనలు ఇంకా తగ్గలేదు. అటు చూస్తే మరణాల సంఖ్య కూడా తెలంగాణలో రోజురోజుకీ పెరుగుతోంది. ఇంక పరిస్థితి విషమంగా ఉన్న వారి సంగతి ఎత్తకపోవడం మంచిది.

 

దీంతో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన పై అనుమానాలు మరియు అతని తీరుపైన వ్యతిరేక భావం మూకుమ్మడిగా వచ్చేశాయి. ఇటువంటి సమయంలో నేడు జరిగిన అచ్చెన్నాయుడు అరెస్ట్ కేసీఆర్ కు పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. అసలు కనీసం ప్రెస్ మీట్ పెట్టలేని స్థితిలో కేసీఆర్ ఉండగా ఒక్కసారిగా విపక్షాలు కూడా ఊపందుకోవడంతో అతనికి ఏమీ పాలుపోని పరిస్థితిలో సరైన సమయంలో ఆంధ్ర లో జరిగిన విషయం మీడియా వారితో పాటు ప్రజలందరి దృష్టిని ఆకర్షించి రోజంతా దాని గొడవ లోనే గడిచిపోయింది.

 

ఎంత కాదన్నా అచ్చెన్నాయుడు అరెస్ట్ వెనుక జగన్ ప్రభుత్వం హస్తం చాలానే ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ కోసమే జగన్ పని చేసాడా అంటే అనుమానమే కానీ ఎంతైనా కేసీఆర్ ను చాలా పెద్ద ఊబిలో నుంచి సగం లాగి ఉడ్డుకి విసిరేశాడు జగన్. ఇక్కడి నుండీ అంతా ఆయన చేతుల్లోనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: