నిరుపేదలైన కుంటుబాలకు రెండు పడకల గదుల ఇళ్లు అందుబాటులో తేవడానికి  ప్రభుత్వం కృషి చేస్తుంటే దీన్ని ఆసరాగా తీసుకుని అమాయక ప్రజలను కొందరు దళారులు మోసం చేస్తు పబ్బం గుడుపుకుంటున్నారు. ప్రజల ఆశను సొమ్ము చేసుకుంటూ రెండు పడకల ఇళ్లు ఇప్పిస్తామని వేల రూపాయలు వసూలు చేస్తు అక్రమాలకు పాల్పడుతున్నారు.. ఇలా ప్రతి చోట అవినీతి, అక్రమాలే కనిపిస్తున్నాయి.. ప్రజలకు కూడా జరుగుతున్న నేరాల పట్ల ఎంతగా అవగాహన కలిగించిన మళ్లీ మళ్లీ నమ్మి మోసపోతూనే ఉన్నారు.. తీరా మోసపోయామని తెలిసాక పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు..

 

 

ఇక అమాయకులను ఇలాగే మోసం చేసిన ఒక నిందితుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేసి అత్తారింటికి పంపించారు.. ఆ వివరాలు తెలుసుకుంటే.. మేడ్చల్‌ జిలా ఉప్పుగూడకి చెందిన యెలగపల్లి రాకేశ్‌యాదవ్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ (46) అనే వ్యక్తి వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్‌. కాగా నాంపల్లిలో నివసించే జావెద్‌ అనే వ్యక్తితో సంబంధాలు పెంచుకొన్న శ్రీనివాస్‌.. తానూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్నట్లు నమ్మించడమే కాకుండా అధికారులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఒక వేళ మీకు రెండు పడక గదుల ఇల్లు కావాలంటే అధికారులతో మాట్లాడి ఇప్పిస్తా అంటూ నమ్మబలికాడు..

 

 

కానీ ఇలా చేయాలంటే వారికి కొంత డబ్బులు తడపవలసి ఉంటుందని చెప్పగా ఇతని మోసాన్ని గ్రహించలేని వారిలో జావెద్‌తో పాటు మరో 18 మంది రూ.20 లక్షల వరకు సమర్పించుకున్నారట.  ఎన్నిరోజులైన ఇల్లు రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన జావెద్‌ అబిడ్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు.. ఇక ప్రజలకు విన్నవించుకునేది ఒకటే ఇలాంటి మోసగాళ్లను నమ్మి మీ కష్టార్జితాన్ని అనవసరంగా దళారుల పాలు చేసుకోకండి. మంచి చెడులు విచారించి ముందుకెళ్ళండి. తొందరగా పనులు అవ్వాలని ఆశిస్తే ఇలాంటి మోసగాళ్ల చేతిలో చిక్కుకోవడం ఖాయం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: