జీవితంలో మార్పులు ఎక్కడ ఎప్పుడు మొదలవుతాయో ఎవరికీ తెలీదు. తాజాగా ఒక్క వ్యక్తి 78ఏళ్ల తరవాత కన్నవారి కోసం వెతకడం ప్రారంభించాడు. తన వయస్సు 78 ఏళ్లు వెస్ట్ వర్జీనియాలో ఉంటాడు. ఏదో ఓ చర్చి హాస్పిటల్‌లో పుట్టాడు. తను పుట్టినప్పుడు ఇచ్చే బర్త్ సర్టిఫికెటులో ఉన్న తండ్రి ఫోటో వేరు కాస్త ఊహ తెలిశాక అమ్మను అడిగాడు. నువ్వు పుట్టకముందే నీ బయలాజికల్ తండ్రితో నాకు విడాకులు తీసుకున్నట్లు తెలిపింది. అతనికి ఫోటో ఆయన అని ఓ పాత ఫోటో ఇచ్చింది. ఉద్యోగం చేస్తున్నపుడు తన తండ్రి అన్వేషణలో పడ్డాడు స్పెన్సర్.

 

 

సోషల్ మీడియాలో ఫోటోలు, వివరాలు గట్రా ప్రపంచం ఎదుట ఓపెన్‌గా.. అలాగే పాత బంధాల్ని, వంశవృక్షాల్ని చెప్పే సైట్లూ బోలెడు అలా చూస్తూ మొత్తానికి ఓ లింక్ దొరకబట్టాడు. స్పెన్సర్ ఫలానా వ్యక్తులు తన రక్తబంధువులు అయి ఉంటారని అనుకున్నాడు. తను డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నాడు. ఇంకొందరికీ పరీక్షలు ఒరిజినల్ తండ్రిని ఎలాగైనా కలుసుకోవాలని బలమైన కోరిక.

 

 

ఒక కుటుంబంలోని వ్యక్తులతో ఆ డీఎన్ఏ సరిపోలింది ఆ కుటుంబ సభ్యులూ షాక్ అదేమిటి..? మనకు అసలు ఏ పరిచయమూ లేని ఈ స్పెన్సర్ డీఎన్ఏ, మన డీఎన్ఏ ఒకేలా ఉండటం ఏమిటి..? ఆ దర్యాప్తులో తేలింది ఏమిటయ్యా అంటే ఇద్దరూ ఒకేసారి పుట్టారు. ఇద్దరు తల్లులకూ పొరపాటున ఒకరి బిడ్డను మరొకరికి ఇచ్చేశారు. అలా స్పెన్సర్, కార్ వేర్వేరు తల్లుల వద్ద పెరిగారు.

 

 

పుట్టిన 78 ఏళ్ల తరువాత తేలిన అసలు నిజం. అసలు నా రంగు, కళ్లరంగు, నా జుట్టు రంగు మా తల్లిదండ్రులతో గానీ, మా ఇతర కుటుంబసభ్యులతో గానీ భిన్నంగా ఉంటుంది. ఎందుకో అర్థమయ్యేది కాదు. స్పెన్సర్‌కు తన ఒరిజినల్ తండ్రి దొరికాడు. ఒరిజినల్ తల్లి అనుకోకుండా దొరికింది. సరే, ఇద్దరూ 78 ఏళ్ల క్రితం జరిగిన తప్పుపై సదరు హాస్పిటల్‌పై కేసు పెట్టారు. ఈ వయస్సులో మొత్తం తమ జీవితచరిత్రే మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: