నేపాల్ విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఎందుకున్నారనే ప్రశ్న గత కొంతకాలంగా వినిపిస్తోంది. మోదీ ఆరేళ్ల పాలనను బట్టి చూస్తే అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో మోదీ ఆచితూచి వ్యవహరిస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లా ఇరు దేశాల మధ్య మధవర్తిత్వం చేస్తాననే తరహా వ్యాఖ్యలు మోదీ ఎప్పుడూ చేయరు. యుద్ధ వాతావరణం నెలకొంటే అలాంటి సమయంలో మాత్రమే ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తులు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. 
 
ఏ దేశం విషయంలోనైనా భారత విదేశాంగ శాఖ స్పష్టంగా వ్యవహరిస్తోంది. ప్రధాని మోదీ నేపాల్ విషయంలో మాట్లాడకపోవడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితులే నేపాల్ లో కూడా ఉన్నాయి. నేపాల్ లో ఆర్.ఎస్.ఎస్ ప్రమేయం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ తలచుకుంటే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చడం కష్టమేమీ కాదు. 
 
మోదీ మహారాష్ట్రలో అధికారంలోకి రావాలని అనుకుంటే సగానికి పైగా శివసేన ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల నుంచి కూడా 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. సుదీర్ఘకాలం నుంచి హిందుత్వ భావజాలం ఉన్న బీజేపీ రాష్ట్రంలో శివసేనను దెబ్బ కొడితే రాష్ట్రంలో హిందువుల మధ్య చీలికలు వచ్చే అవకాశం ఉందని మోదీ సర్కార్ భావిస్తోంది. 
 
మోదీ శివసేనను దెబ్బ తీయాలని ప్రయత్నాలు చేయవద్దని చెప్పడం వల్లే అక్కడ ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. ఈ కారణాల వల్లే మోదీ నేపాల్ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశం అని చెప్పుకునే నేపాల్ ప్రస్తుతం చైనాతో స్నేహపూర్వకంగా మెలుగుతోంది. చైనా కమ్యూనిష్టు భావజాలంతో మతాలను వదిలేయమని చెప్పే దేశం. ఆ విషయాలను అక్కడ ఉన్న ప్రజలే అర్థం చేసుకోవాలని... నేపాల్ తో గొడవలు వద్దని అనుకుని మోదీ మౌనం దాల్చినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: