చైనా పెద్ద దేశం. భూగోళం మీద విస్తీర్ణంలోనే కాదు, జనాభాలోనూ కూడా టాప్ లో ఉంది. అన్నింటికంటే కూడా తెంపరితనంలో కూడా ఫస్ట్ గానే ఉంది. అంతటి చైనాకు ఏ దేశమైనా బలాదూర్. అందులో భారత్ అంటే మరీ తీసికట్టు.

 

అటువంటి చైనాను జుట్టి పట్టి ఆవల వైపు దారిచూపిన ఘనత కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీదే అని చెప్పాలి. మోడీ మొండితనమే కాదు, దౌత్యం కూడా ఇపుడు బాగా అక్కరకు వస్తోంది. మోడీ అంతర్జాతీయంగా సాధించిన పేరుతో బాటు ఆయన అమెరికాతో చేస్తున్న వ్యూహాత్మకమైన మైత్రి కూడా బాగా అక్కరకు వస్తోంది.

 

నిజానికి చైనాకు భారత్ మీద పీకల్లోతు కోపం ఉంది. ఆరు దశాబ్దాల క్రితం నమ్మించి నాటి ప్రధాని నెహ్రూని మోసం చేసి యుధ్ధం చేసి గెలిచిన చైనాకు ఆ విజయగర్వం ఇంకా అలాగే ఉంది. అయితే ఇపుడు దేశంలో పరిస్థితులు మారాయన్నది చైనాకు మెల్లగా అర్ధమవుతోంది.

 

కాంగ్రెస్ జమానాలో సరిహద్దుల వద్ద మోహరించి మన భూభాగాలను లాగేసుకున్న చైనా అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. అయితే ఇపుడు ఉన్నది కాంగ్రెస్ కాదు, బీజేపీ అని మోడీ గట్టిగానే జవాబు చెబుతూ వచ్చారు. డొక్లాం సరిహద్దుల వద్ద చైనా గత ఏడాది అల్లరి చేస్తే తిప్పికొట్టిన మోడీ ఇపుడు లఢక్ వద్ద తిష్ట వేసి నెలరోజులుగా యుధ్ధానికి కాలు దువ్వుతున్న చైనాను  చాలా జాగ్రత్తగా వెనక్కుపంపిస్తున్నారు.

 

ఈ విషయంలో సామధాన భేద దోండోపాయాలు అన్నీ కూడా ఉపయోగిస్తున్నారు. మొత్తం మీద మోడీ నాయకత్వంలో మొనగాడి నాయకత్వం ఉందని చైనాకు అక్షరాలా రుజువు చేస్తున్న మోడీ డ్రాగాన్ కోరలు కొమ్ములు దించారన్నది వాస్తవం.  ఇదే కాదు రానున్న రోజుల్లో మారుతున్న ప్రపంచంలో చైనా ఆధిపత్యం తగ్గి భారత్ పాత్ర విశేషంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే చైనాకు శాశ్వతంగా ఆటకట్టినట్లు అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: