దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఊహించని రీతిలో నమోదవుతున్న తరుణంలో దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దాదాపు రోజుకి పది వేల కొత్త కేసులు నమోదు అవటంతో కేంద్రంలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా లాక్ డౌన్ ఆంక్షలు మరియు సడలింపులు ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా రోడ్లపై రావటంతో పాటు లాక్ డౌన్ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటం వల్లే దేశంలో వైరస్ మరింతగా విజృంభిస్తోంది అని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు.

 

ముఖ్యంగా మహారాష్ట్ర , తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ఇలా ఏడు రాష్ట్రాల్లో కేసు తీవ్రత రోజురోజుకు పెరిగి పోతుండటంతో ఆయా రాష్ట్రాలు సొంతంగానే లాక్ డౌన్ విధించాలనే ఆలోచనతో ఉన్నాయి. భారీ ఎత్తున కేసులు మరోపక్క మరణాలు కూడా అదేరీతిలో పెరుగుతున్న తరుణంలో కేంద్రం మరోసారి లాక్ డౌన్ ఆంక్షలు మరియు సడలింపులు విషయంలో సీరియస్ డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 16, 17 వ తారీకు లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ బేటీ అవటానికి రెడీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ లాక్ డౌన్ నిబంధనలు అమలు సడలింపులు వంటి విషయాలతో పాటు, కరోనాాా ను అదుపులోకి తీసుకు వచ్చే విషయాలతో  లాక్ డౌన్ అమలవుతున్న విధానంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇదిలా ఉండగా దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి లాక్ డౌన్ విధించాలని మోడీని కోరాటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇటువంటి సమయంలో మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది సస్పెన్స్ గా మారింది. మరోపక్క వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కొద్దీ పెరుగుతున్న తరుణంలో సంపూర్ణ లాక్ డౌన్ ఒక రెండు వారాల పాటు విధిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మోడీ అన్నట్లు జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి. కేసులు ఉన్న కొద్ది పెరుగుతున్న తరుణంలో మోడీ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వ్యక్తులు వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: