తమిళనాడులో కరోనా విలయతాండవం చేస్తుంది. కరోనా ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రంలో రోజు రోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి తప్ప ఏ మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఇక ఈ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1989 పాజిటివ్  కేసులు నమోదు కాగా 30మంది కరోనాతో మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ప్రస్తుతం రెండో స్థానంలో వుంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 42000కేసులు నమోదు కాగా  397 మంది మృతిచెందారు. అయితే టెస్టుల విషయంలో మాత్రం తమిళనాడు అభినిందించాల్సిందే. ఇప్పటివరకు 700000లక్షల టెస్టులు చేయడం గమనార్హం. 
 
 
ఇక కేరళ లోను ఈరోజు భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 85 కేసులు నమోదు కాగా అందులో 71 కేసులు విదేశాలనుండి వచ్చినవి అని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ కేసులతో కలిపి కేరళ లో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2407కు చేరగా 1045 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం1342కేసులు యాక్టీవ్ గా ఉండగా 19మంది మరణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: