కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో పరిస్థితులు మొత్తం మారిపోతున్నాయి. వైరస్ రాకతో కరోనా వైరస్ ముందు కరోనా వైరస్ తర్వాత అనే ప్రపంచం క్రియేట్ అయ్యేవిధంగా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది ప్రజలు భయపడుతూ బతుకుతూ ఎవరిని ఎక్కడ ముట్టుకుంటే వైరస్ సోకుతుందో అనే ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా లో వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ పెరిగిపోవడంతో చాలావరకు ఆంక్షలు నిబంధనలు వేడుకలకు జారీ చేస్తున్నాయి ప్రభుత్వాలు.

 

ఈ నేపథ్యంలో పెళ్లి విషయంలో 50 మందికి మించి హాజరుకాకూడదు అని ఆంక్షలు విధించడం జరిగింది. గుంపులుగుంపులుగా ఉండేచోట వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే కొంతమంది అత్యుత్సాహం గలవారు 50 మంది కంటే ఎక్కువగానే బంధువులను పిలిపించుకొని వివాహాలు చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ విధంగానే నిజామాబాద్ పట్టణంలో ఏకంగా ఓ పెళ్లి వేడుకకు 120 మందిని పిలుచుకొని ఓ ఫంక్షన్ హాల్ లో భారీ స్థాయిలో వివాహ వేడుక చేసుకోవడానికి రెడీ అయ్యారు.

 

అయితే ఫంక్షన్ హాల్ దగ్గర ఎక్కువగా వాతావరణం సందడి కనిపించడంతో సమాచారం పోలీసుల దాకా వెళ్లడంతో.. వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. అప్పటికి ఇంకా పెళ్లి స్టార్ట్ కాకపోవటంతో నిబంధనలను అతిక్రమించి పెళ్లికి వచ్చిన వారికి నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా కేవలం ఎనిమిది మందిని మాత్రమే కల్యాణ మండపంలో ఉంచి ఆ పెళ్లి నిర్వహించారు. దీంతో పెళ్లి వేడుకకు వెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకున్న వారికి ఒక్కసారిగా పోలీసులు షాక్ ఇచ్చినట్లు అయింది. మరో పక్క 50 మంది కూడా కళ్యాణ మండపం లేకపోవటంతో పెళ్లి కూడా చాలా విడ్డూరంగా జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: