ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీగా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండగా.. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ పార్టీ ఉన్న విషయం తెలిసిందే. ఇక జనసేన బిజెపి పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయి కానీ ఆ పార్టీలకు  తగినంత బలం లేదు.ఈ క్రమంలోనే  జనసేన బిజెపి పార్టీలు కలిసి నడవడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రణాళిక అమలు చేస్తూ వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టడమే  లక్ష్యంగా ముందుకు నడుస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్   ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. ఇక మొదటి నుంచి బీజేపీ జనసేన పార్టీలు  బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పాత్ర నిర్మాణాత్మకంగా పోషిస్తూ వస్తున్నాయి . 

 


 అయితే గతంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నిధులు లేవని రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోంది అంటూ టీడీపీ  కొన్ని విమర్శలు చేయగా జగన్ మాత్రం వరుస పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు నేరుగా డబ్బులు చేరేలా  చేయడంతో పాటు కొన్ని నిర్మాణాలను కూడా పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటర్లు సహా మరికొంత మంది వైసీపీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక టిడిపి ఓటర్లు అయితే వేరే పార్టీ వైపు చూసే అవకాశాలు లేవు. కానీ ఇదే సమయంలో గతంలో టిడిపి ప్రభుత్వం చేసిన అవినీతి నచ్చక ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కొన్ని విషయాలలో వ్యవహరిస్తున్న తీరు అంగీకరించలేక తటస్థంగా ఉన్న ఓటర్లు కొంతమంది ఉన్నారు. 

 


 ఇలా తటస్థంగా ఉన్న ఓటర్లు అటు టిడిపి వైపు వెళ్లలేక ఇటు వైసీపీ వైపు ఉండలేక అయోమయంలో ఉన్నారు. ఇలాంటి సమయంలోనే జనసేన బిజెపి పార్టీలు ఎంతో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా రుజువు చేసుకుని తటస్థంగా ఉన్న ఓటర్లను తమవైపు తిప్పుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎంతగానో కలిసొచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు విశ్లేషకులు. అయితే ప్రతి అంశంలో అటు టిడిపి పార్టీ కంటే జనసేన బిజెపి పార్టీలు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర  నిర్వహిస్తున్నాయని చివరివరకు ఇలాగే  కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తటస్థంగా ఉన్న ఓటర్లు  బిజెపి జనసేన పార్టీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయని... ఈ అవకాశాన్ని బిజెపి జనసేన పార్టీ లు ఉపయోగించుకోవాలని అంటున్నారు. లేనిపక్షంలో మళ్లీ ఇలాంటి అవకాశం జనసేన బిజెపి పార్టీలకి వచ్చే అవకాశం మాత్రం లేదు అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: