దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య ను అదుపు చేయడం ఎవరి తరం కావడం లేదు. రోజుకు కనీసం 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అసలు వైరస్ మనల్ని వదిలిపోతుందా లేదా మనతో పాటు మన జీవితంలో మమేకం అయిపోతుందా అని కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో చాలా మంది కేంద్రం మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇకపోతే మోడీ ప్రభుత్వం కూడా మళ్లీ పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ను విశించేందుకే సన్నాహాలు జరుగుతున్నట్లు పలువురు భావిస్తుండగా అందుకు తగ్గట్టు మోడీ పెద్ద హింట్ ఇచ్చేశారు అని కూడా చెబుతున్నారు. ఈనెల 16 మరియు 17 తేదీల్లో దేశంలోని ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు. రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది మరియు వైరస్ నివారణ చర్యలు ఎలా తీసుకుంటున్నారు అన్న విషయాలపై చర్చించే అవకాశం ఉంది.

 

అయితే దాదాపు రెండు నెలల గ్యాప్ తర్వాత మోదీ మళ్లీ ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహించడం విశేషం. కావున చాలా మంది నిపుణులు కచ్చితంగా మోడీ లాక్ డౌన్ విషయమై ముఖ్యమంగ్త్రుల అభిప్రాయం తెలుసుకునేందుకే చర్చిస్తున్నారు అని తేల్చి చెప్పేస్తున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు మహారాష్ట్ర సీఎం లతో మోడీ దీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది. ఒక్క మహారాష్ట్ర మరియు తమిళనాడు రాష్ట్రాల నుండే లక్షా 40 వేల కేసులు నమోదు కావడం గమనార్హం.

 

ఒకవేళ ఆందరు ముఖ్యమంత్రులు కూడా మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్ కు మొగ్గుచూపితే కనీసం నెల రోజులైనా అని దేశవ్యాప్తంగా మళ్ళీ అన్నీ సేవలు స్థంబించే అవకాశం ఉంది. అయితే సారి మాత్రం ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారు అన్న విషయం ఆసక్తిగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: