ప్రపంచం జాతకం ఈ సంవత్సరం బాగాలేనట్లుగా ఉంది.. ఎందుకంటే ఈ సంవత్సరం దేశదేశాలు, ప్రభుత్వాలు, ప్రజలు ఇలా అందరు నష్టపోతున్నారు.. కష్టాల పాలవుతున్నారు.. ఇంతటి విపత్కర పరిస్దితుల్లో వినిపించే వార్త ఏదైనా ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందనేది వాస్తవం.. ఇకపోతే ప్రస్తుతం ప్రజలతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుకుంటున్న కరోనా వైరస్ వల్ల ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన జీవితాల్లో మరో బాంబ్ పేల్చారు కొందరు సిద్దాంత కర్తలు.. మాయన్ క్యాలెండర్ తప్పుంటూనే, ఈ సంవత్సరం జూన్ 21న ప్రపంచం అంతం తప్పదంటూ అభిప్రాయపడుతున్నారు.

 

 

ఇకపోతే 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టినప్పుడు అప్పట్లో కొన్ని నాన్-కాథలిక్ దేశాలు ఈ క్యాలెండర్ వాడలేదు. వారు జూలియన్‌ క్యాలెండర్‌ను వాడే వారు. దానిలో 365.25 రోజులనే సంవత్సరంగా తీసుకున్నారు. కానీ దశాంశ స్థానాల్లో తేడా ఉండడంతో రాను రాను క్యాలెండర్ వల్ల వివిధ రకాల ఇబ్బందులు తలెత్తాయి. అందువల్ల 1752లో బ్రిటన్ ‌దేశాల వాళ్లు కూడా గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరించాలని నిర్ణయించాయి. ఇలా చేయడం వల్ల వారు అనుసరించిన తేదీ సెప్టెంబరు 3 నుండి 14గా మారింది. ఈ విధంగా బ్రిటీష్ హిస్టరీలో ఆ 11రోజులు మాయం అయి పోయాయి. ఇలా ఈ వింత చర్యల వల్ల పుట్టుకొచ్చిందే కుట్ర సిద్దాంతం.. ఇప్పుడు ఈ సిద్దాంత కర్తలే ప్రజలను భయానికి గురిచేస్తున్నారు..

 

 

ఇక కొంతమంది కుట్ర సిద్ధాంత కర్తలు డిసెంబర్ 21, 2012 లో ప్రపంచం అంతం అవుతుందని పేర్కొన్నారు కానీ అది జరగలేదు.. తాజాగా ఈనెల 21న అని మరోసారి వారు తెరపైకి వచ్చారు.. ఇక నాసా లెక్కల ప్రకారం చూస్తే.. ఈ విపత్తు మొదట్లో మే 2003లో ఉంటుందని అంచనా వేశారు. కానీ, అప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఆ తర్వాత డిసెంబర్ 2012 లో యుగాంతమంటూ పేర్కొన్నారు.. అదీ విఫలమైంది.. ఇకపోతే సైన్స్ చెప్పే విషయం ఏంటంటే ఇలాంటివన్ని కల్పితాలు. ఈ వాదన పుస్తకాలు, సినిమాలు, డాక్యుమెంటరీలు లేదా ఇంటర్నెట్ మొదలైన వాటి ద్వార సేకరించి ప్రజలను భయానికి గురిచేస్తున్న ఘటనలు.. అయినా వీరి వాదనలకు నమ్మదగిన ఆధారాలు లేవనే చెప్పాలి. 2012లో యుగాంతం అన్నారు.. ఏమి లేదు.. ఇప్పుడు 2020 జూన్ 21న ప్రపంచం అంతం అవుతుందనడం అబద్దం అని శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు.. ఇకపోతే ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుందో తెలియదు గానీ ఈ గాలి వార్తలతో జనం ఇప్పుడే చచ్చేలా ఉన్నారంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: