ప్రతి మనిషికి ఉన్న ఖచ్చితమైన అవసరాలలో సెలూన్ షాపుకు వెళ్లడం అనేది దాదాపుగా తప్పని పరిస్దితి, అయితే కరోనా వచ్చినప్పటి నుండి కాలు బయటపెట్టాలంటే ఆలోచించే పరిస్దితులు తలెత్తాయి.. ఇక లాక్‌డౌన్ సడలించాక ప్రజలు రోడ్డెక్కుతున్నారు కానీ కరోనా మాత్రం ఎప్పుడు ఎక్కడపడితే అక్కడే ఉందన్న విషయం మరచినట్లుగా ఉన్నారు.. ఈ దశలో కొందరు ఆచితూచి వ్యవహరిస్తుండగా, మరికొందరు ఇష్టారీతిగా తిరుగుతున్నారు.. ఇదిలా ఉండగా ఎదుగుతున్న జుట్టు, పెరుగుతున్న గడ్దం మనిషికి చికాకు తెప్పిస్తుంది.. అందువల్ల సెలూన్ షాపుకు వెళ్లని పరిస్దితి..

 

 

గడ్దం అయితే ఇంట్లో చేసుకోవచ్చూ కానీ కటింగ్ కోసం మాత్రం సెలున్‌కు తప్పని సరిగా వెళ్ళాలి.. ఇలాంటి పరిస్దితుల్లో సెలూన్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. అక్కడ సేవలూ ప్రియమయ్యాయి. ఇకపోతే కరోనా నేపథ్యంలో జాగ్రత్తల విషయంలో సెలూన్‌లు ఆసుపత్రులను తలపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత తెరుచుకున్న వాటిల్లో ప్రత్యేక ఏర్పాట్లు వచ్చాయి. నిర్వాహకులు వ్యక్తిగత పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. ఇప్పుడు మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లు, పీపీఈ కిట్‌లు, వ్యక్తిగత వస్త్రాలు మొదలైనవి, కత్తెరలు, దువ్వెనలు, అద్దాల వంటివాటి సరసన చేరాయి. వీటి వల్ల రేట్లు కూడా బాగానే పెరిగాయి..

 

 

ఇకపోతే కొన్ని సెలూన్ షాపుల్లో మాస్క్‌ ఉంటేనే అనుమతిస్తున్నారు. ముందే థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా ఉష్ణోగ్రతను తెలుసుకుంటున్నారు. కుర్చీ, కత్తెరలు, దువ్వెనల వంటివాటిని వినియోగదారుని సమక్షంలోనే పూర్తి స్థాయిలో శానిటైజ్‌ చేస్తున్నారు. సీట్లో కూర్చోడానికి ముందే ప్రత్యేక కిట్‌ తెరుస్తున్నారు. అందులోంచి కాళ్లకు, తలకు పెట్టుకునే కవర్‌లు, చేతులకు గ్లౌజ్‌లు తదితరమైనవి అందించి ధరించమని చెబుతున్నారు.

 

 

కొన్నిచోట్ల ఒకసారి వాడి పారేసే కత్తెర్లు వాడుతున్నారు. సేవలు అందించేవారు ప్రత్యేక మాస్క్‌, పీపీఈ కిట్‌ ధరిస్తున్నారు.. అయితే ధరలు మాత్రం సెలూన్‌ ఆధారంగా రూ.150 నుంచి రూ.1,000 అంతకంటే ఎక్కువ వరకు వసూలు చేస్తుండగా, అత్యధిక చోట్ల 30 నుంచి 40 శాతం దాకా రేట్లు పెరిగాయట. ఇక తలకు భారమైన జుట్టు, జేబుకు కూడా భారంగానే మారుతున్న నేపధ్యంలో పేదవారి పరిస్దితి దారుణమే మరి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: